#NTR: చరణ్ తో బుచ్చిబాబు?.. ఎన్టీఆర్ సినిమా ఉందా లేదా? అసలు నిజం ఏంటంటే?

 అందుకే ఇప్పుడు బుచ్చిబాబు రూట్ మార్చదు అని తెలుస్తుంది. బుచ్చిబాబు తర్వాత రెండో సినిమా ఎన్టీఆర్ తో కాకుండా రామ్ చరణ్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 

 

Why Ntr reject  Buchi Babu script?

తొలి చిత్రం ఉప్పెనతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడి గా గుర్తింపు ను తెచ్చుకున్న డైరక్టర్ బుచ్చిబాబు. అయితే ఉప్పెన సినిమా వచ్చి ఇంతకాలం అయినా ఆయన నెక్ట్స్ సినిమా మొదలుకాలేదు. మొన్నటిదాకా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీన్ లోకి మరో హీరో వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రికీ పరిచయం ఉన్న బుచ్చిబాబు..  పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన `ఉప్పెన` మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి మూవీ `ఉప్పెన` బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది. దానితో ఈ దర్శకుడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఓ రేంజ్‌ లో క్రేజ్ లభించింది. అయితే నెక్ట్స్ సినిమాకు కథ రెడీ చేసుకున్నా హీరోలంతా బిజిగా ఉండటంతో ఏదీ ప్రారంభం కాలేదు.   

`ఉప్పెన` మూవీ తర్వాత ఈ దర్శకుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక భారీ మూవీ చేయబోతున్నట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఆ కథలో ఎన్టీఆర్ ..పెద్ద వయస్సు పాత్రలో కనిపించబోతున్నాడని ,కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఉత్సాహం చూపిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు చాలా ప్రయత్నాలు చేశాడు.  కొరటాల శివతో ఎన్టీఆర్ చేసే ప్రాజెక్టు కథ విషయంలో  ఆలస్యం జరిగితే  బుచ్చిబాబు కథ పై ఎన్టీఆర్ కొన్నాళ్ళు కూర్చున్నాడు అని అన్నారు.

కానీ ఇప్పుడు బుచ్చిబాబు మరో స్టార్ హీరో పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ హీరో రామ్ చరణ్ అంటున్నారు. `రంగస్దలం` సమయంలో బుచ్చిబాబుతో, చరణ్ కు పరిచయం ఏర్పడింది. బుచ్చిబాబుని బాగా నమ్మే హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. దాంతో రామ్ చరణ్ తో ముందుకు వెళ్దామని డిసైడ్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి. అయితే బుచ్చిబాబు ప్రాజెక్టుని ఎన్టీఆర్ నిజంగా ప్రక్కన పెట్టాడా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం బుచ్చిబాబు తన కథతో..  ఎన్టీఆర్ ను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాడంటూ పుకారు వినిపించింది. ఇంతలో కొరటాల ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ అయ్యి...పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఈ  క్రమంలో బుచ్చిబాబు కథను ఎన్టీఆర్ పూర్తిగా పక్కన పెట్టాడంటూ వార్తలొస్తున్నాయి.

 అయినా  ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా తీయాలంటే.. అంతకంటే ముందే కొరటాల శివ అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా అనేది పూర్తి కావాలి. కానీ ఈ సినిమాలు అనేవి ఇంకా ప్రారంభం కానేలేదు. ఎన్టీఆర్, కొరటాల సినిమా షూటింగ్ అనేది వాయిదా పడుతూనే ఉంది. వెయిటింగ్ లో పడి ఉండటం ఇష్టం లేని బుచ్చిబాబు,  చరణ్ చెంతకు చేరే అవకాసం ఉందనే టాక్‌ తెరపైకి వచ్చింది.  

కానీ ఇందులో నిజం లేదని తెలుస్తుంది. బుచ్చిబాబు ఇప్పటికీ ఎన్టీఆర్‌తోనే ఉన్నారట. అయితే తారక్‌.. కొరటాల శివ సినిమా త్వరగా స్టార్ట్ అయితే ఆ తర్వాత సినిమాగా బుచ్చిబాబు చేయాలనుకున్నారట. ప్రశాంత్‌ నీల్‌తో చేయాల్సిన సినిమా కంటే ముందే ఈసినిమాని పట్టాలెక్కించాలనుకున్నారట. కానీ కొరటాల మూవీ ఆలస్యం కావడంతో ఆ వెంటనే ప్రశాంత్‌ నీల్ మూవీ ఉన్ననేపథ్యంలో ఇప్పుడు బుచ్చిబాబు వెయిటింగ్‌లో ఉన్నారట. అంతేకాని ఆ కథతో చరణ్‌తో సినిమా చేస్తున్నాడనేదాంట్లో నిజం లేదని టాక్‌. ఆ కథని ఎన్టీఆర్‌ కోసమే ఉంచాడని, ప్రస్తుతం ఆయన కోసమే బుచ్చిబాబు వేచి ఉన్నాడని అంటున్నారు. మరి ఇది ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios