Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ త్రివిక్రమ్ ని తగులుకున్న బండ్లన్న, కారణం ఇదేనా?

 అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు  అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేశాడు

Why Bandla Ganesh Trolls again Trivikram
Author
First Published May 27, 2023, 4:21 PM IST


ట్విట్టర్‌లో బండ్ల గణేష్ అప్పుడప్పుడు గురూజీ అంటూ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేస్తుంటాడనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఓ నెటిజన్‌కు బండ్ల గణేష్‌ ఇచ్చిన రిప్లై బాగా వైరల్ అయ్యింది.  నాకు నిర్మాత కావాలని ఉంది బండ్లన్న అని ఓ నెటిజన్ సలహా అడిగాడు. అయితే గురూజీని కలువు..మంచి కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వు అంటూ కౌంటర్లు వేశాడు బండ్ల గణేష్. ఇక ఆ తరువాత మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు రిప్లై ఇవ్వడం,ఇంకా దానికి ఇచ్చిన సమాధానంతో కాక రేపాడు. 

గురూజీకి కనుక కథ చెబితే.. స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగ్గట్టు మళ్లీ కథను అంతా మార్చి.. ఇక అసలు అనుకున్న కథను షెడ్డుకు పంపిస్తాడట కదా? అని అడిగాడు ఓ నెటిజన్.ఇక దానికి బండ్ల గణేష్‌ ఇలా సమాధానం ఇచ్చాడు. అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని గురుశిష్యుల్ని ఎవర్నైనా వేరు చేస్తాడు  అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై కౌంటర్లు వేశాడు. దీంతో పవన్ కళ్యాణ్‌ రేణూ దేశాయ్ విడాకుల వ్యవహారం వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నాడా? అనే టాక్ మొదలైంది. అది ప్రక్కన పెడితే..ఎందుకు మళ్లీ బండ్లన్న ..హఠాత్తుగా త్రివిక్రమ్ ని తగులుకున్నాడు..మళ్లీ ఏదన్నా తెరవెనక వీరి మధ్య ఏదైనా జరిగిందా అనే విషయమై సినీ జనం ఆచూకీ తీస్తున్నారు.

వాస్తవానికి త్రివిక్రమ్ వల్లే తనకు, పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది అనేది బండ్ల గణేష్ భావన. అందుకే, త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్లు అని అందరికీ అర్దమైంది.పవన్ ఫ్యాన్స్  ప్రతీ ఈవెంట్లో బండ్ల గణేష్‌ ఉండాలని కోరుకుంటారు.కానీ భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ విషయంలో మాత్రం పెద్ద వివాదం రేగింది. తనను త్రివిక్రమ్ శ్రీనివాస్ అడ్డుకుంటున్నాడని, తనను కావాలనే పిలవడం లేదని బండ్ల గణేష్ మాటలు సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే.మొదట్లో ఆ ఆడియో తనది కాదని గణేష్ బుకాయించినా ఫలితం లేదు. అప్పటికే వైరల్ అయ్యిపోయింది.ఆ తరువాత అవి తన మాటలే అని, త్రివిక్రమ్‌ను తిట్టానని అతను ఒప్పేసుకున్నాడు. ఇలా బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని ఇప్పుడు అందరికీ మరోసారి అర్థమైంది.

అయితే అంతకు ముందు అప్పడప్పుడు అఫీషియల్ గానో, అనీఫిషయల్ గానో పవన్ కళ్యాణ్  తనను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు బండ్లకు అవకాసం ఇచ్చేవారు. భీమ్లా నాయక్ వివాదం తర్వాత పూర్తిగా బంద్ అయ్యింది. అయితే ఈ మధ్యన మరో సారి పవన్ ని కలుద్దామని బండ్ల ప్రయత్నించారని..ఆయన తో తను ఓ సినిమా ప్లాన్ చేయాలనుకున్నారని, అందుకు త్రివిక్రమ్ ...ఆ అవకాసం బండ్లకు ఇవ్వలేదని సమాచారం. ఎందుకంటే పవన్ ని సినిమా నిమిత్తం కలవాలంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ కథ,ప్లానింగ్ ప్రకారం వెళ్లాలి. తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు వచ్చే ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఈ క్రమంలో మళ్లీ త్రివిక్రమ్ అడ్డుపడ్డారనే బండ్ల బాధ అని చెప్పుకుంటన్నారు. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios