ఎన్టీఆర్ సక్సెస్ ని బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా.?! ఈ రచ్చ ఏంటి
ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన నాటు నాటు ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో ఇప్పుడీ పాట ప్రపంచవ్యాప్తం అయిపోయింది.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ విషయం బూతద్దంలోంచి చూడటం ,రచ్చ చేయటం కామన్ అయ్యిపోయింది. ముఖ్యంగా యాంటి ప్యాన్స్ తమ అభిమాన హీరోలను లేపటం కోసం మిగతా హీరోల ఫ్యామిలీలలో చిచ్చు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటిదే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో జరుగుతూ వైరల్ అవుతోంది. అదేమిటంటే...ఆర్.ఆర్.ఆర్ లో పాటకు ఆస్కార్ రావటం, ఎన్టీఆర్ ని ప్రపంచం అంతా మెచ్చుకోవటం బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి.
ఆ వార్తలకు వాళ్లు చూపిచే రుజువు ఏమిటంటే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ పురస్కారం దక్కడంపై నందమూరి బాలకృష్ణ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి అభినందనలు తెలిపారు.. అది గొప్ప విషయమే కానీ, తన అభినందనలో ఎక్కడా బాలకృష్ణ మాటమాత్రమైనా జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావనకు తీసుకురాలేదనేది వారి అభియోగం. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంటే, అందులో జూనియర్ ఎన్టీయార్ కూడా వుంటాడన్నా వారు ఒప్పుకోవటం లేదు. అన్న హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీయార్, ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తే జీర్ణించుకోలేకపోతున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి అభినందనలు తెలిపే క్రమంలో జూనియర్ ఎన్టీయార్ పేరుని ప్రస్తావించలేకపోవటమే కారణంగా చూపెడుతున్నారు.
మరికొందరు మరో అడుగు వేసి ఎందుకు ఎన్టీయార్ అంటే బాలయ్యకు ఇంత చిన్న చూపు? అని సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. అయితే అది ఎన్టీఆర్ అభిమానులు మరొకరు పని కాదు..కావాలని ఎన్టీఆర్ కు, వాళ్ల బాబాయ్ బాలయ్యకు మధ్య గొడవ రావాలని ఆకాంక్షించే కొందరి పని అనేది నిజం. అయితే వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే..ఆ ట్వీట్ లో రామ్ చరణ్ ని ప్రస్తావించలేదు. వేరొకరు అయితే ఇంకాస్త ముందుకు వెళ్ళి ..తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీయార్‌ని పలకరించడానికీ ఇష్టపడని బాలయ్య, ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అభినందనలో ఎన్టీయార్ పేరుని ప్రస్తావిస్తాడని ఎలా ఆశించగలం.? అంటూ పుల్ల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుత సోషల్ మీడియాతో జరుగుతున్న రాజకీయం.