Asianet News TeluguAsianet News Telugu

'పెదకాపు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ ఆ హీరోయేనా?

పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. 

who is the cheif guest for Pedakapu Pre Release Event jsp
Author
First Published Sep 22, 2023, 7:02 AM IST | Last Updated Sep 22, 2023, 7:02 AM IST


 శ్రీకాంత్ అడ్డాల గ్యాప్  తర్వాత పెద కాపు టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలసిందే.  కొత్త నటీనటులతో ఆయన చేస్తున్న ప్రయోగం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ తెరపైకి తీసుకురాబోతున్న సినిమా పెద కాపు-1. ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్ రిలీజైనప్పటినుంచి  అంచనాలు మొదలయ్యాయి. తప్పకుండా ఈసారి శ్రీకాంత్ విభిన్నమైన కథాంశంతో రానున్నాడు అనిపిస్తోంది. కానీ సినిమాకు అనుకున్నంత స్థాయిలో అయితే ఇంకా అంచనాలు పెరగలేదు. మరో ప్రక్క చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ పంక్షన్ ని భారీగా ప్లాన్ చేసారు. 

పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తున్నారో అనేది మాత్రం బయిటకు రాలేదు. అయితే మీడియా వర్గాల్లో మాత్రం నందమూరి బాలకృష్ణ ఈవెంట్ కి రావొచ్చన్న టాక్  నడుస్తోంది. పైగా బాలయ్య కి చాలా రోజుల తర్వాత అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, ఆ సాన్నిహిత్యం తో బాలయ్య ఖచ్చితంగా రావొచ్చని అంటున్నారు. అయితే ఆయన పొలిటికల్ హడావిడిలో ఉన్నారు. అక్కడ ఖాళీ చేసుకుని రావాల్సి ఉంటుంది. దాంతో ఖరారు గా చెప్పలేనని అనటంతో పోస్టర్ పై ఎక్కడా మెన్షన్ చేయలేదని తెలుస్తోంది. అయితే లాస్ట్ మినిట్ లో ఓకే అయినా వెంటనే నందమూరి అభిమానులకు తెలియచేస్తారు. మరో ప్రక్క వెంకటేష్ ని సైతం ఈ ఈవెంట్ కు శ్రీకాంత్ అడ్డాల పిలిచారని చెప్తున్నారు. ఇక పెదకాపు సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.  

 దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కథను చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది.   మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios