ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వెంటనే ప్రారంభం అవుతుందనే  అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవు. ఈ సినిమా విషయంలో కాస్త లేటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్‌ల సినిమా అనౌన్స్‌ చేసి చాలా రోజులైన సంగతి తెలసిందే. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వెంటనే ప్రారంభం అవుతుందనే అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవు. ఈ సినిమా విషయంలో కాస్త లేటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లేదా జూలైలో కాకుండా ఆగస్ట్‌లో మాత్రమే ప్రారంభమవుతుందని సమాచారం. స్క్రిప్ట్‌ని టైట్‌గా రూపొందించడానికి ఎన్టీఆర్ కొరటాల శివకు సమయం ఇచ్చాడని తెలుస్తోంది. ఆచార్య తర్వాత కొరటాల శివ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో మొన్నటి వరకు ఆలియా భట్ హీరోయిన్‌గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె ప్రస్తుతం తన ప్రియుడిని పెళ్లి చేసుకుని కాస్తా బిజీ అయ్యింది. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30 చేయడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె ప్లేస్‌లో రష్మిక మందన్న పరిశీలిస్తున్నారట టీమ్. అందులో భాగంగా రష్మిక మందన్న‌తో ఎన్టీఆర్ 30 టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు.

ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.