అనఫీషియల్ : ఆ ఇద్దరి టాలీవుడ్ నటులపై బ్యాన్
ఇండస్ట్రీ మొత్తం వీరిపై బ్యాన్ పెట్టడం లేదు. కేవలం కొందరు హీరోలు, నిర్మాతలు ఈ బ్యాన్ పెట్టబోతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ మారిన విషయం...ఆ ఇద్దరి నటులపై అనీఫిషయల్ బ్యాన్. ఫిల్మ్ సర్కిల్స్ లో ఏ ఇద్దరు కలిసినా ఈ టాపిక్ ఖచ్చితంగా వస్తోంది. ఇద్దరూ క్యారక్టర్ ఆర్టిస్ట్ లు కావటం విశేషం. గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలు, వివాదాలు తెలుసున్న వారికి ఈ ఇద్దరు ఆర్టిస్ట్ లు ఎవరో ఇట్టే అర్దమైపోతుంది. అయితే ఇండస్ట్రీ మొత్తం వీరిపై బ్యాన్ పెట్టడం లేదు. కేవలం కొందరు హీరోలు, నిర్మాతలు ఈ బ్యాన్ పెట్టబోతున్నట్లు సమాచారం.
తమపై కామెంట్స్ చేసిన వారికి తమ సినిమాల్లో వేషాలు ఇవ్వటం ఎందుకనే వాదన వినపడుతోంది. వారు తమ నోటిని అదుపులో పెట్టుకోకుండా మీడియా ముందు చేసిన అనుచిత వ్యాఖ్యలే వారి కొంప ముంచాయంటున్నారు. ఇద్దరూ సీనియర్ నటులే కావటం విశేషం. ఓ వర్గం హీరోల గ్రూప్ తమ నిర్మాతలకు వీరిద్దరిని తాము నటిస్తున్న సినిమాల్లో తీసుకోవద్దని ఆల్టిమేటం జారీ చేసారని చెప్పుకుంటున్నారు. తమ సినిమాల్లో ఒక్క వేషం కూడా వీరికి ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు సదరు హీరోలతో భవిష్యత్తులో చేద్దామనుకునే నిర్మాతలు సైతం ఈ క్యారక్టర్ ఆర్టిస్ట్ లతో పనిచేయకూడదని డిసైడ్ అవుతున్నారట.
Also read ఈటల-కేసీఆర్ ఎపిసోడ్... వెన్నుపోటు టైటిల్ తో వర్మ సంచలన చిత్రం!
అయితే ఈ హీరోలు ఎవరు కూడా తమ అభిప్రాయాలను, వీరిని అదుపులో పెట్టాలనే తమ ఆలోచనను మీడియా ముందు ఓపెన్ గా చెప్పటానికి ఇష్టపడటం లేదంటున్నారు. అల్రెడీ ఓ యంగ్ హీరో సినిమా నుంచి ఈ సీనియర్ ఆర్టిస్ట్ ని తీసేసారని ప్రక్కన పెట్టారని చెప్పుకుంటున్నారు. నాలుగు రోజులు షూటింగ్ చేసాక వీరిని తీసేసారని, అతని ప్లేస్ లో ఓ సీనియర్ కమిడియన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యన వేషాలు లేక టీవీ షోలు చేసుకుంటున్న సీనియర్ కమిడియన్ కు మళ్లీ వేషాలు ఇచ్చి బిజీ చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇలా బ్యాన్ పెడుతున్న క్యారక్టర్ ఆర్టిస్ట్ లను ఇంకో వర్గం అక్కున చేర్చుకోబోతోందిట.
Also read హీరోలను ప్రశ్నించనివారు, నా దుస్తులపై వ్యాఖ్యలా.... కోటపై అనసూయ నిప్పులు