The Warrior: కలెక్షన్స్ పరిస్దితి అంత దారుణమా?
రెండో రోజుకు చాలా దారణమైన డ్రాప్ కనపడింది. చూస్తూంటే మొత్తం మీద 50% రికవరీ కూడా అయ్యే పరిస్దితి కనపడటం లేదంటున్నారు. అదే కనుక జరిగితే రామ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలవనుంది. వీకెండ్ కలెక్షన్స్ లో ఊపు కనపడకపోవటం తో పూర్తి నిరాశపూరిత వాతావరణం కనపడుతోంది. చూడాలి..చివరకు ఏమి జరగనుందో...
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేసిన సినిమా 'ది వారియర్' (The Warriorr Movie). లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రామ్ తమిళ తెరకు పరిచయం అవుతున్నారు. డీసీపీ సత్య పాత్రలో రామ్ గెటప్, ట్రైలర్, పాటల్లో కృతి శెట్టితో వేసిన స్టెప్పులు సినిమాపై అంచనాలు కలిగించాయి. అయితే సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. మార్నింగ్ షోకే ఈ సినిమా కు డివైడ్ టాక్ వచ్చేసింది. మరో ప్రక్క టిక్కెట్ రేట్లు తగ్గక పోవటం, వర్షాలు కూడా దెబ్బ తీస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ట్రేడ్ లో ఏమంటున్నారో చూద్దాం.
ఈ సినిమాకు వచ్చిన యావరేజ్ టాక్ ,నెగిటివ్ రివ్యూలు సినిమా కలెక్షన్స్ పై దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఈ సినిమా భాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ దిసగా ప్రయాణం చేస్తోంది. ఈ సినిమాకు 35 కోట్లు థియేటర్ రైట్స్ బిజినెస్ జరిగింది. అయితే మొదట రోజు కేవలం ఆరు కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే 17% మాత్రమే రికవరీ అయ్యింది. రెండో రోజుకు చాలా దారణమైన డ్రాప్ కనపడింది. చూస్తూంటే మొత్తం మీద 50% రికవరీ కూడా అయ్యే పరిస్దితి కనపడటం లేదంటున్నారు. అదే కనుక జరిగితే రామ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలవనుంది. వీకెండ్ కలెక్షన్స్ లో ఊపు కనపడకపోవటం తో పూర్తి నిరాశపూరిత వాతావరణం కనపడుతోంది. చూడాలి..చివరకు ఏమి జరగనుందో...
ఇక ఇలాంటి పోలీస్ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి మెప్పించటమే ప్రధాన మైనస్ గా మారింది. ఒక డాక్టర్.. పోలీస్‌గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనేది ఒక్కడే కొత్త పాయింట్. అది నమ్మే 'ది వారియర్'ను తెరకెక్కించారు దర్శకుడు ఎన్ లింగుస్వామి. డాక్టర్‌గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ అవేమీ జనాలను థియేటర్ కు రప్పించటంలో ఎక్సైట్మెంట్ కలగచేయలేకపోతున్నాయి.