Thaman: ‘అఖండ’,‘భీమ్లా’సక్సెస్...రేటు పెంచిన థమన్, ఇప్పుడెంతంటే
అఖండ సక్సెస్ లో 50 శాతం థమన్ ఒక్కడే తీసుకున్నాడంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో ఆయన కొట్టిన పాటల కంటే కూడా బిజిఎం అందరి చెవుల్లో మార్మోగిపోతుందనేది ఇనానమస్ టాక్.
చేతిలో హిట్ ఉంటేనే సినీ పరిశ్రమలో విలువ. ఎంత అడిగితే అంత ఇచ్చే పరిస్దితి. థమన్ సిట్యువేషన్ కూడా అదే. గత కొంతకాలంగా స్టార్స్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నకు థమన్ కు సక్సెస్ రేటు కూడా ఎక్కువే ఉంది. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమా 'అఖండ'కు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసారు. ఈ సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కు భీబత్సమైన పేరు వచ్చేసింది. ఇదే సినిమాకు హైలైట్ అని విమర్శకులు, బాలయ్య అభిమానులు తనను పొగడ్తలతో ముంచేసారు. ఆ తర్వాత పవన్ తో చేసిన భీమ్లా నాయక్ సైతం సూపర్ హిట్ అవటం థమన్ కు కలిసి వచ్చింది. ఈ నేపధ్యంలో థమన్ తన రెమ్యునేషన్ పెంచేసారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్ళ తర్వాత ఇప్పుడు థమన్ స్టార్ట్ అయ్యింది. దేవీశ్రీ ప్రసాద్ ని దాటి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ మధ్య కాలంలో థమన్ అందిస్తున్న సంగీతం మరో స్థాయిలో ఉంది. ఏ సినిమాకు ఇచ్చినా కూడా ప్రాణం పెట్టి పని చేస్తున్నాడని అర్దమవుతోంది. అదే స్దాయిలో ఆ సినిమాలు కూడా అలాగే హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన చేతిలో 15 సినిమాల వరకు ఉన్నాయి.
అఖండ సక్సెస్ లో 50 శాతం థమన్ ఒక్కడే తీసుకున్నాడంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలో ఆయన కొట్టిన పాటల కంటే కూడా బిజిఎం అందరి చెవుల్లో మార్మోగిపోతుందనేది ఇనానమస్ టాక్. ఆ సౌండ్స్‌కు బాక్సులు బద్దలైపోయాయి. అమెరికా లాంటి థియేటర్స్ లో మా బాక్సులు బ్రద్దలైపోతున్నాయంటూ కంప్లైంట్ ఇచ్చారంటేనే అర్దం చేసుకోవాలి. అఖండ తర్వాత తమన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అఫీషియల్ గా ఈయన నెంబర్ వన్ అయిపోయాడు.
పెద్ద సినిమాలకు ఈయన 2.50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఎప్పుడో ఈయన రెమ్యునేషన్ రెండు కోట్లు దాటాలి కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చిన్న సినిమాలకు తక్కువగానే తీసుకుంటున్నాడు థమన్. పెద్ద సినిమాల వరకు మాత్రం బాగానే వసూలు చేస్తున్నాంటున్నారు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్‌కు వచ్చే రెమ్యునరేషన్‌లో వారు సౌండ్ ఇంజనీర్లకు, మ్యూజిక్ ప్లేయర్స్‌కు, మిక్స్ ఇంజనీర్లకు కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా మొత్తంగా కలిపితే తమన్ రెమ్యునరేషన్ నుంచి భారీ మొత్తమే బయిటకు వెళ్తుంది.