మైత్రీ స్కెచ్ అదిరిందిగా... దిల్ రాజుకు కౌంటర్ ఇచ్చినట్లే?
మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
ఈ 2023 సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్న చిరు, బాలయ్య సినిమాల ఒకే ప్రొడక్షన్ నుంచి వస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు సైతం తన తమిళ,తెలుగు చిత్రం వారసుడుని రిలీజ్ పెట్టారు. మరో ప్రక్క అజిత్ నటించిన తెగింపుని సైతం కొన్ని ఏరియాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సిట్యువేషన్ ఖచ్చితంగా మైత్రీ వారికి కాస్త ఇబ్బందికరమైనదే. అనుకున్న థియేటర్స్ దొరకవు. క్రేజ్ ఉన్న థియేటర్స్ ఇప్పటికే వారసుడు కు కేటాయించబోతున్నారని ట్రేడ్ లో వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో పోటీని ఎదుర్కోవటానికి, తాము నష్టపోకుండా ఉండటానికి మైత్రీ వారు ఓ డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు.
అదేమిటంటే...'వాల్తేరు వీరయ్య' ,'వీరసింహా రెడ్డి' చిత్రాలు రెండింటికి టిక్కెట్ రేట్లు 50 రూపాయలు చొప్పున పెంచబోతున్నారట. ఈ మేరకు ఫర్మిషన్స్ తీసుకుంటున్నారట. అప్పుడు ఓపినింగ్స్ అదిరిపోతాయి. పండగ టైమ్ లో టిక్కెట్ రేటు పెరిగినా జనాలకు పట్టింపు ఉండదు. కొత్త అల్లుళ్లు ... అవసరమైతే బ్లాక్ లో అయినా టిక్కెట్లు తీసుకుని చూస్తారు. ఫ్యాన్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అంతే కాదు తక్కువ థియోటర్స్ లో ఉండటం వలన లాంగ్ రన్ నడిచే అవకాసం ఉంది. ఇవన్నీ చాలదన్నట్లు పండగ మూడు రోజులు రోజుకు 6 షోలు చొప్పున పడేలా ఫర్మిషన్ తెచ్చుకుంటున్నారట. విజయ్, అజిత్ సినిమాలకు టిక్కెట్ రేటు పెంచే అవకాసం ఉండదు... షోలు పెంచరు. బెనిఫిట్ షోలు ఉండవు. ఇవన్నీ మైత్రీకు ప్లస్ కానున్నాయి.
అఖండ వంటి పెద్ద హిట్ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కావడంతో వీర సింహా రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయనేది నిజం. అలాగే అన్ స్టాపబుల్ తో ప్రస్తుతం బాలకృష్ణ క్రేజ్ పీక్స్ లో ఉంది, దాంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన పాటలు సూపర్ హిట్ అవటం తో మెగాభిమానుల్లోనూ ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అయ్యంది. వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ , పూనకాలు లోడింగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మెగా స్పందన వస్తోంది.
మెగాస్టార్ .. మాస్ మహారాజ్ కలిసి చేసిన సినిమా కావడం వలన ఇది మెగా మాస్ మూవీ . ఈ సినిమాలో యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్స్ .. ఫైట్స్ .. ఇలా ఎవరికి ఏం కావాలో అవి ఉండేలా బాబీ చూసుకున్నాడు. ఈ కథను .. పాత్రలను ఆయన బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమాకు భారీగా ఓపినింగ్స్ వస్తాయి.
ఇక ఈ రెండు సినిమాల్లోనూ దేనికి ఓపినింగ్స్ ఎక్కువ వస్తాయంటే...USA అడ్వాన్స్ బుక్కింగ్ లను బట్టి బాలయ్య చిత్రం ట్రెండింగ్ లో ఉంది. ఇక వాల్తేరు వీరయ్య ఇక్కడ అదరకొడ్తుంది. కాబట్టి ఏ సినిమా క్రేజ్ దానిదే. రిలీజ్ రోజు రెండు సినిమాలకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయి. సినిమా టాక్ ని బట్టి సంక్రాంతి తర్వాత కలెక్షన్స్ ఉంటాయి.
అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. జనవరి 12న వీర సింహా రెడ్డి విడుదల కానుండగా.. అదే రోజున విజయ్ వారసుడు, అజిత్ తెగింపు చిత్రాలు వస్తున్నాయి. అయితే థియేటర్ల విషయంలో దిల్ రాజు ఆధిపత్యం నడుస్తుంది. ముఖ్యంగా నైజాం, ఉత్తరాంధ్రలో మెజారిటీ థియేటర్లు ఆయన చేతిలో ఉంటాయి. జనవరి 12న వారసుడు, తెగింపు చిత్రాలు ఎక్కువ థియేటర్లను లో కనపడతాయి. వారసుడు సొంత సినిమా కాబట్టి దానిని భారీస్థాయిలో విడుదల చేయనున్నాడు. అలా కావల్సినన్ని థియేటర్లు దొరక్క వీర సింహా రెడ్డి ఫస్ట్ డే వసూళ్లకు భారీ గండి పడే ఛాన్స్ ఉందని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.