ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కెకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన ఫిర్యాదులో రియా చక్రవర్తి పేరును ప్రస్తావించారు. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. 

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రియా చక్రవర్తి కోసం ముంబైలోని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అప్పటికే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. దాంతో బీహార్ పోలీలులు ఆమె కోసం లుకవుట్ నోటీసులు జారీ చేశారు.

Also Read: సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు కొట్టేసిన రియా చక్రవర్తి!

నలుగురితో కూడిన పోలీసు బృందం పాట్నా నుంచి ముంబైకి చేరుకుంది. సుశాంత్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ చేసిన ఫిర్యాదులోని వాస్తవాలను తెలుసుకోవడానికి వారు రియాను ప్రశ్నించాలని అనుకున్నారు. అయితే, ఆమె తన ఇంట్లో కనిపించలేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన మరణించే వారకు సుశాంత్ రియాతో డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరు పెళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సుశాంత్ జూన్ 14వ తేదీన మరణించాడు. 

Also Read: సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై ఎఫ్ఐఆర్: ముందస్తు బెయిలుకు రియా చక్రవర్తి యత్నాలు

ఇదిలావుంటే, కేసును బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనీషిండే చెప్పారు.