Jr NTR: ‘పెద్ది’లో షాకిచ్చే ఎలిమెంట్, క్లైమాక్స్ లో ఎన్టీఆర్ ని అలా చూపిస్తారట ?
బుచ్చిబాబు, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు చాలా కాలం నుంచి టాక్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మూవీ ఉందా? లేదా? అనే సందేహం కూడా మొదలైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎనౌన్సమెంట్ టైమ్ బయిటకు వచ్చింది. అలాగే మరో ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చి ఆశ్చర్యపరుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు ‘పెద్ది’ అని, అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టే ఆలోచనలో దర్శక-నిర్మాతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కబడ్డీ ఆటగాడిగా ఒక ఆశయం దిశగా హీరో ముందుకు వెళ్ళే కథ ఇది అని చెప్తున్నారు.అయితే బుచ్చిబాబు, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు చాలా కాలం నుంచి టాక్ నడుస్తుండగా.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో మూవీ ఉందా? లేదా? అనే సందేహం కూడా మొదలైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎనౌన్సమెంట్ టైమ్ బయిటకు వచ్చింది. అలాగే మరో ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చి ఆశ్చర్యపరుస్తోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అధికారిక అనౌన్సమెంట్ ఈ ఏప్రిల్ మిడ్ లో వస్తుంది. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసున్న మాజీ ఆటగాడిగా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ఇది విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ అరవై ఏళ్ల వయస్సు వాడిగా తెరపై కనపడటం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఆ వయస్సులోనూ కబడ్డీ మ్యాచ్ లో పాల్గొనటం క్లైమాక్స్ ఉంటుందని చెప్తున్నారు. కథ ఎక్కువ శాతం ప్లాష్ బ్యాక్ లో నడుస్తుందని వినికిడి.
హీరో ఆశయం చుట్టూ ఆవేశం, బలమైన ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయటానికి రంగం సిద్దమైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్లుగా రష్మిక మందన్నా, కీర్తి సురేశ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాతే పెద్ది ఉంటుందంటున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ భారీ సినిమా అనంతరం తారక్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో ఆల్రెడీ రెండు సాలిడ్ ప్రాజెక్ట్ లు అనౌన్స్ కాగా మరొకటి అనౌన్స్ కావాల్సి ఉంది.