Sidhu Jonnalagadda:సితార బ్యానర్ కు 'డీజే టిల్లు' షాక్ ఇచ్చాడా?

రవితేజ వంటి స్టార్ హీరో నటించిన ‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బయ్యర్లుకీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.

Sidhu Jonnalagadda shocks Sithara Entertainments !?


 ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్  'డీజే టిల్లు'  అనే  చిన్న సినిమానే. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. రిలీజ్ కు ముందూ ఊహించని స్దాయిలో క్రేజీ బజ్ తెచ్చుకుంది. ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన యూత్ .. డీజే టిల్లు థియోటర్స్ ముందు క్యూలు కట్టారు. ఈ సినిమాలో టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ చేసే హడావుడి నచ్చేసి ,రిపీట్ ఆడియన్స్ పెరిగారు. దాంతో రవితేజ వంటి స్టార్ హీరో నటించిన ‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బయ్యర్లుకీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది.

రిలీజ్ కు ముందు చేసిన ప్రి రిలీజ్ బిజినెస్‌కు రెట్టింపు స్థాయిలో దీనికి షేర్ రావడం విశేషం. ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటిపోవడం గమనార్హం. ‘భీమ్లా నాయక్’ వచ్చే వరకు ఈ సినిమానే బాక్సాఫీస్‌ను లీడ్ చేసింది. థియేట్రికల్ రన్ ముగిశాక ‘డీజే టిల్లు’ ఓటీటీ బాట పట్టి అక్కడా సంచలనం రేపుతోంది. ఈ నేపధ్యంలో టిల్లూ గా నటించిన సిద్దు..ఆ బ్యానర్ కు షాక్ ఇచ్చేడనే వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  డీజే టిల్లు రిలీజ్ కు ముందు ఇదే బ్యానర్ లో మరో సినిమా చేయటానికి సిద్దు ఓ ప్రాజెక్టు సైన్ చేసారట మళయాళ రీమేక్ కప్పేలాని రీమేక్ చేయాలని నిర్మాతల ప్లాన్. అందులో సెకండ్ లీడ్ రోల్ కు అడిగారట. అయితే టిల్లు హిట్టయ్యాక...ఆ రీమేక్ లో చేయనని చెప్తున్నారట. సిద్దు ప్రొడక్షన్ హౌస్ వారితో మాట్లాడి...తన కొత్త స్టార్ డమ్ తో ఏదైనా స్టైయిట్ సినిమా తనే హీరోగా ప్లాన్ చేయమని, సెకండ్ లీడ్ రోల్స్ వద్దని రిక్వెస్ట్ చేసారట. ఇది ప్రొడక్షన్ హౌస్ కు షాక్ ఇఛ్చిందని చెప్పుకుంటున్నారు.

మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన కప్పెల మూవీని డెబ్యూ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ టీ రమేశ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  సిద్దు జొన్నల గడ్డ, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో శివాత్మికను నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయతే ఈ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా మలయాళ నటి అనికా సురేంద్రన్‌ను మేకర్స్‌ ఖరారు చేశారట. అలాగే ఇప్పుడు సిద్దు ప్లేస్ లో కూడా మరొకరని తీసుకోవాలన్నమాట. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios