KGF,Salaar:'కేజీఎప్ 2', 'సలార్' రెంటికీ కలిపి షాకింగ్ డీల్, వింటే మతిపోతుంది
శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా 'కే జి ఎఫ్: చాప్టర్ 1'. కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది ఈ సినిమా సక్సెస్ తర్వాత అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు 'కే జి ఎఫ్: చాప్టర్ 2' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా కి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 సినిమాని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల కానుందని ఇటీవల ప్రకటించిన కరోనాతో పాటు ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ వేదికగా కేజీఎఫ్ చాప్టర్ 2 పోస్టర్ ని విడుదల చేశాడు. అలాగే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్. ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ రెండు చిత్రాలకు కలిపి ఓవర్సీస్ డీల్ పూర్తి చేసినట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్ డైరక్టర్ చేసిన KGF: చాప్టర్ 2 మరియు సాలార్ యొక్క ఓవర్ సీస్ ఎగ్రిమెంట్ ను ఇటీవల ముగించారు. రెండు భారీ చిత్రాల ఓవర్సీస్ హక్కులను 100 కోట్ల రూపాయలకు ఫార్స్ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. బాహుబలి మరియు RRR మినహా భారతీయ చిత్రానికి ఈ స్దాయి భారీ డీల్ జరగలేదు. దాంతో ట్రేడ్ మొత్తం షాక్ అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టులను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
వాస్తవానికి శాండల్ వుడ్ పేరు అందరి నోట్లో నానేలా చేసిన సినిమా 'కే జి ఎఫ్: చాప్టర్ 1'. కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది ఈ సినిమా సక్సెస్ తర్వాత అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ఇప్పుడు 'కే జి ఎఫ్: చాప్టర్ 2' అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి కనిపించబోతుంది. ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు. ఆ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని ఈ ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.