Pushpa Part 2 : ‘పుష్ప -2’కు షాకింగ్ బడ్జెట్,అంత పెడుతున్నారంటే మాటలు కాదు
పుష్ప సినిమా భారీ విజయాన్ని మాత్రమే కాదు రికార్డు కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా ఊర మాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
‘పుష్ప’(Pushpa) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్(Allu arjun) అనే సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ‘పుష్ప2’ చేస్తున్నారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనులను చిత్ర టీమ్ వేగవంతం చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కు బడ్జెట్ ఎంత పెట్టబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
బన్ని అభిమానులంతా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా రాబోతున్న "పుష్ప: ది రూల్" గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ బిజినెస్ వర్గాలు సైతం ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ విషయమై ఓ వార్త బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది. మొదటి అనుకున్న ప్లాన్ ప్రకారం ‘పుష్ప’ రెండవ భాగం ‘పుష్ప ది రూల్’ ని అల్లు అర్జున్ రెగ్యులర్ బడ్జెట్ లోనే చేద్దామనుకున్నారు. అయితే సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి బడ్జెట్ ని పెంచుకుంటూ పోయారని వినికిడి. అది నాలుగు వందల కోట్ల దగ్గర ఆగింది.
ఈ బడ్జెట్ లో అల్లు అర్జున్ వంద కోట్ల రూపాయలు తన రెమ్యునరేషన్ గా తీసుకుంటారు. సుకుమార్ కు 65 కోట్లు ఇస్తారు. మిగతా యాక్టర్స్, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ 35 కోట్లు ఉంటుంది. మొత్తం అన్ని లెక్కలు కలిపి 200 కోట్లు దాకా ఆంచనా వేసారు. ఇక సినిమా మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మీద 200 కోట్లు దాకా ఖర్చు పెట్టనున్నారు.
దానికి తోడు ‘పుష్ప 2’కు ప్రమోషన్స్ భారీగా చేయాలి. సరిగ్గా ప్లాన్ చేసి, బాగా అమలు చేయడానికి కనీసం ఒక సంవత్సరం అవసరం అని భావిస్తున్నారట. గతేడాది ‘పుష్ప’ విడుదల సమయంలో సుకుమార్, అతని టీమ్‌కి అనేక సమస్యలు ఎదురయ్యాయి. చాలా ప్రింట్‌లు పేలవమైన సౌండ్ మిక్సింగ్‌తో బయిటకు వెళ్లాయి. టెక్నికల్ సమస్యలు, అనవసర తలనొప్పులు రాకుండా ఉండేందుకు ఈ ఏడాది ‘పుష్ప 2’ విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. సౌండి మిక్సింగ్ అస్సలు కుదర్లేదు. చాలా ప్రింట్స్ లో పేలవమైన సౌండ్ మిక్సింగ్ కనిపించింది. అదృష్టవశాత్తూ కంటెంట్ బాగుంది కాబట్టి, అవన్నీ కవర్ అయిపోయాయి. మరోవైపు గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ తేలిపోయాయి. ఆఖరి నిమిషంలో తలెత్తిన ఇలాంటి సమస్యల్ని పుష్ప-2 విషయంలో రిపీట్ చేయకూడదని యూనిట్ భావిస్తోంది.
మరో ప్రక్క పుష్ప సినిమా హిట్టవ్వడంతో పార్ట్-2పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు తగ్గించుకోవడం పాటు కాస్టింగ్ పై కూడా మరోసారి ఆలోచించుకోవాలి. కేజీఎఫ్ హిట్టవ్వడంతో, పార్ట్-2 కోసం సంజయ్ దత్, రవీనాటాండన్ లాంటి బాలీవుడ్ తారల్ని రంగంలోకి దించారు. పుష్ప-2 కోసం అలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా సినిమాను తీయాలంటే వచ్చే ఏడాది విడుదల పెట్టుకుంటేనే కరెక్ట్ అని అంటోంది ట్రేడ్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది.