Asianet News TeluguAsianet News Telugu

నిజమా?: సమంతకు 200 కోట్లు చైతూ ఆఫర్

తమ విడాకుల గురించి నాగ‌చైత‌న్య‌, సమంత దాదాపు ఒకేసారి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఈ క్రమంలో మీడియా మొత్తం ఈ వార్త చుట్టూ తిరుగుతోంది. రకరకాల కథనాలు, రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ జంట గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
 

Samantha Rejected 200 Crore Offer From Naga Chaitanya?
Author
Hyderabad, First Published Oct 3, 2021, 10:27 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యువ హీరో అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ విడాకుల గురించి నాగ‌చైత‌న్య‌, సమంత దాదాపు ఒకేసారి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఈ క్రమంలో మీడియా మొత్తం ఈ వార్త చుట్టూ తిరుగుతోంది. రకరకాల కథనాలు, రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ జంట గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..

వెండితెరపై స్టార్స్ గా వెలుగొందుతున్న స్టార్ కపుల్ నాగచైతన్య, సమంతలు కొద్ది రోజులుగా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. ఇటీవల విడుదలైన నాగచైతన్య బ్లాక్ బస్టర్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కు సమంత రాకపోవడం.. అక్కినేని నాగార్జున ఇంట విందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హాజరైనప్పుడు సైతం సమంత కనిపించకపోవడంతో రూమర్స్ బలంగా వినిపించాయి. కొద్ది రోజుల మౌనం తర్వాత ఎట్టకేలకు ఇరువురూ వైవాహిక బంధాన్ని తెంచేసుకుని స్నేహితులుగా కలసి ఉంటామంటూ ప్రకటించారు. దశాబ్దకాలంగా ఇరువురమూ కలసి జీవించామని.. ఈ కష్టకాలంలో మీడియా, అభిమానులు తమకు సహకరించాలని వారు కోరారు. ఈ క్రమంలో నేషనల్ మీడియాలో  ఓ వార్త వచ్చింది.

విడాకులు తీసుకుని విడిపోతున్న నేపధ్యంలో నాగచైతన్య ఆమెకు భరణంగా 200 కోట్లు ఆఫర్ చేసారని , దాన్ని సమంత వద్దందని ఆ వార్త సారాంశం. తాను సెల్ఫ్ మేడ్ ఇండిడ్యువల్ కాబట్టి తనకు డబ్బేమీ అవసరం లేదని ఆమె తేల్చి చెప్పినట్లు వార్త వచ్చింది. అయితే అందులో నిజమెంత అనేది తెలియదు.

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే..కమర్షియల్‌‌ సినిమాల్లో హీరోయిన్ పాత్రల కంటే.. ఫిమేల్‌‌ సెంట్రిక్‌‌ సబ్జెక్ట్స్‌‌ చేయడానికే ఇష్టపడుతోంది సమంత. అందుకే ‘శాకుంతలమ్‌‌’ సినిమాకి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశానంటోంది. గుణశేఖర్‌‌‌‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శకుంతలగా నటించిందామె. రీసెంట్‌‌గా ఆమె  పోర్షన్​ షూటింగ్‌‌ పూర్తవడంతో ఇన్‌‌స్టాలో ఎమోషనల్‌‌ అయ్యింది సామ్. ‘ఈ సినిమా నాకు జీవితాంతం గుర్తుంటుంది. నేను చిన్నప్పట్నుంచీ ఫెయిరీ టేల్స్​ని నమ్ముతాను. ఇప్పటికీ అంతే.. పెద్దగా మారలేదు. ఇప్పుడీ ఫెయిరీ టేల్‌‌ని నాకిచ్చి నా కలను నిజం చేశారు గుణశేఖర్. 

ఆయన కథ చెప్పినప్పుడే అందమైన మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాను. అలాంటి ప్రపంచం మరొకటి లేదనిపించింది. సెల్యూలాయిడ్ మీద ఆ అందమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా అనిపించింది. గుణ సర్ నా అంచనాలకు మించి సృష్టించారు. షూటింగ్‌‌ జరిగినన్నాళ్లూ నాలోని చిన్నపిల్ల ఆనందంతో చిందులేసింది. ఇంత మంచి సినిమాని నాకిచ్చిన గుణశేఖర్‌‌‌‌కి రుణపడి ఉంటాను’ అంటూ పొంగిపోయింది సమంత. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్, చిన్ననాటి భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అర్హ నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు సమర్పణలో నీలిమ నిర్మిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios