చిరంజీవి 'గాఢ్ ఫాధర్' కమిటైన సల్మాన్ ఖాన్
పాత్ర చిన్నదే అయినా..పాపులర్ హీరో ఆ క్యారక్టర్ లో కనిపిస్తే మంచి బజ్ వస్తుంది. అందుకే సల్మాన్ ను ఆన్ బోర్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నెల 13లోపు ఈ విషయంపై క్లారిటీ రానుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ స్నేహం గురించి అందిరకీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ అన్ని విధాల సపోర్ట్ గా ఉండే బాలీవుడ్ సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే మెగాస్టార్ త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. హిందీలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో తెలుగు లో సత్యదేవ్ కనిపించనున్నారు. అలాగే ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్లు సమాచారం.
పాత్ర చిన్నదే అయినా..పాపులర్ హీరో ఆ క్యారక్టర్ లో కనిపిస్తే మంచి బజ్ వస్తుంది. అందుకే సల్మాన్ ను ఆన్ బోర్డ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నెల 13లోపు ఈ విషయంపై క్లారిటీ రానుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.అనుకున్నట్లు అన్నీ జరిగితే ఈ ప్రాజెక్టు మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో రాబోతున్న మొదటి సినిమా కాబోతోంది. ఎల్ వి ప్రసాద్ నిర్మించబోయే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గాడ్ ఫాధర్ అనే టైటిల్ ని ఈ సినిమాకు ఫైనలైజ్ చేసారు.
ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత మోహన్ రాజాతో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేశ్‌తో వేదాళం రీమేక్, బాబీతో ఓ మూవీ చేయనున్నాడు. అయితే లూసిఫర్ షూటింగ్‌లో పాల్గోనడానికి ముందు చిరు చికిత్స తీసుకునేందుకు విశాఖపట్నం వెళ్లారు.
నేచర్‌క్యూర్ ఆయుర్వేద చికిత్స కోసం ఆయన వైజాగ్ వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. డీటాక్సిఫికేషన్, రెజువెనేషన్ ప్రక్రియలో భాగంగా అక్కడి ప్రముఖ ఆయుర్వేదిక్ స్పా సెంటర్‌కు వెళ్లారట. అక్కడే పది రోజులు పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్న అనంతరం ఆయన లూసిఫర్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.