‘ఆర్‌ఆర్‌ఆర్’: ఫైట్స్ గురించిన ఈ న్యూస్ ఫ్యాన్స్ కు పండగే
దాదాపు ప్రతీ నిముషాలకు ఓ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉండబోతోందని వినికిడి. ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ కూడా ఆర్ ఆర్ ఆర్ ఫైట్స్ ని కొత్తగా చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం పావెల్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
రాజమౌళి సినిమాలంటే సాధారణంగా యాక్షన్,ఎమోషన్ సీక్వెన్స్ లు ప్రధానంగా సాగుతాయి. ఈ సారి కూడా ఆయన వాటిపైనే పూర్తి దృష్టి పెడుతున్నారు. ఆయన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో కూడా యాక్షన్ కే ప్రయారిటీ. అలాగే ఆ యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజిలో ఉండబోతున్నాయి. ఈ విషయమై బయిటకు వచ్చిన ఓ వార్త అభిమానులను పండగ చేసుకునేలా చేస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాగ్జిమం పది ఫైట్ ఎపిసోడ్స్ ఉన్నాయట. ఎప్పటిలాగే ఇంట్రవెల్, క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్స్ అయితే అద్బుతంగా డిజైన్ చేసారని, గూస్ బంప్స్ వచ్చేలా ఉండేలా వాటిని తెరకెక్కిస్తున్నారని సమాచారం. దాదాపు ప్రతీ నిముషాలకు ఓ థ్రిల్లింగ్ ఎపిసోడ్ ఉండబోతోందని వినికిడి. ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ కూడా ఆర్ ఆర్ ఆర్ ఫైట్స్ ని కొత్తగా చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం పావెల్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
సినిమాను అన్ని ఏరియాల బిజినెస్ ప్రారంభమైంది. ఇప్పటికే సినిమా కు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ను భారీ మొత్తానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. బాలీవుడ్ లో పెద్ద సినిమాలను అందిస్తున్న పెన్ ఇండియా వారు...ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం రికార్డు స్థాయి రేట్ ను కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా ను ఉత్తరాదిన భారీ ఎత్తున విడుదల చేస్తామని అంటున్నారు.
ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ సైతం డబ్ చేసి ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని సమాచారం. అమెరికా, యూరప్ కంట్రీలలో ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హాలీవుడ్ లో క్రేజ్ పుట్టించటం కోసం హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో ప్రమోషన్ చేయనున్నట్లు వినికిడి. వాళ్లు ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లేందుకు సాయిం చేస్తారు. అప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాక ...హాలీవుడ్ లోనూ ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా అక్కడవారితో బిజనెస్ చేసే అవకాసం ఉంటుంది. రాజమౌళి ఈ సారి తన సినిమాతో నెక్ట్స్ లెవిల్ చూడాలనుకుంటున్నారు.
చిత్ర విశేషాలకు వస్తే..రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి గురువు పాత్రను అజయ్ పోషిస్తున్నారని సమాచారం. ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా.. ఉండనుందని చిత్ర బృందం ప్రకటించింది.