Ram Gopal Varma: సివిల్ కోర్టు జడ్జ్ పై వర్మ కేసు వేయనున్నారా?

ఎలాంటి న్యాయపరమైన సూత్రాలు పాటించకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన సివిల్ కోర్ట్ జడ్జ్ మీద తెలంగాణ హైకోర్టుకు ఫిర్యాదు చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయినట్టు చెప్తున్నారు. ఆ కంప్లయింట్ కాపీని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణకు పంపించాలని డిసైడ్ అయ్యారట. 

RGV To file a complaint in the Telangana High court on the civil judge?


ఎప్పుడూ ఏదో విదాదంలో మీడియాలో కనపించే వర్మ ఈ సారి ..సివిల్ కోర్ట్ జడ్జ్ మీద కేసు పెట్టడానికి   రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజమెంత అనేది మాత్రం తెలియరాలేదు. ఈ మేరకు మీడియాలో అయితే ప్రచారం జరుగుతోంది.  వివరాల్లోకి వెళితే...
 
 ప్రముఖ దర్శక - నిర్మాత రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా వివాదం కోర్టు కు ఎక్కింది. వర్మ తనకు డబ్బులు ఇవ్వాలని, అవి ఇచ్చే వరకు 'మా ఇష్టం' (డేంజరస్ / ఖత్రా) విడుదల కాకుండా చూడాలని నట్టి కుమార్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో ఏప్రిల్ 8న  రిలీజ్ కాలేదు.

'మా ఇష్టం' (Maa Ishtam / Dangerous) సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత తన సంతకాలను నట్టి కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్జరీ చేశారని వర్మ ఆరోపించారు. మరోవైపు నట్టి కుమార్ వివిధ మీడియా సంస్థల్లో తనలా చాలా మందికి వర్మ డబ్బులు ఎగ్గొట్టారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన పరువుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన నట్టి కుమార్ అండ్ కోపై కేసులు పెట్టడానికి ఆర్జీవీ రెడీ అయ్యినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు హైదరాబాద్‌లోని కొంతమంది టాప్ లాయర్లు, సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో వర్మ సమావేశమైనట్టు తెలిసింది. రాజకీయ నాయకులను కూడా కలిశారట. ఎలాంటి న్యాయపరమైన సూత్రాలు పాటించకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిన సివిల్ కోర్ట్ జడ్జ్ మీద తెలంగాణ హైకోర్టుకు ఫిర్యాదు చేయడానికి రామ్ గోపాల్ వర్మ రెడీ అయినట్టు చెప్తున్నారు. ఆ కంప్లయింట్ కాపీని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణకు పంపించాలని డిసైడ్ అయ్యారట. అయితే ఇవన్నీ మీడియాలో వస్తున్న వార్తలే . అఫీషియల్ సమాచారం మాత్రం కాదు.
 
అంతేకాదు నట్టి కుమార్, ఆయన పిల్లలు కరుణ, క్రాంతిపై క్రిమినల్ ఫోర్జరీ, సైబర్ క్రైమ్ కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టం, ఆర్థిక నష్టం దావా వేయాలని రామ్ గోపాల్ వర్మ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 'మా ఇష్టం' సినిమాపై కింద కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ను హైకోర్టు కొట్టివేయడంతో మే 6న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios