#RGV: కొత్త ట్విస్ట్...బోయపాటికి కౌంటర్ గా వర్మని వదులుతున్నారా?

ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వర్మ భేటీ అయిన దాఖలాలే లేవు. తాజాగా  ఉన్నట్టుండి వర్మ విజయవాడ రావడం, ఆ వెంటనే జగన్ తో భేటీ అయిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

RGV planning a film on #YSJagan to counter to Boyapati film with Balayya?


వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవ్వటం రకరకాల స్పెక్యులేషన్స్ కు ఊతం ఇస్తోంది. రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  మొదట పవన్ కళ్యాణ్ తో సినిమా చేయమని జగన్ చెప్పారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదేం కాదు ..అంటోంది. వివరాల్లోకి వెళితే...

బుధవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లిన వర్మ...సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాదాపుగా 40 నిమిషాలకు పైగా జగన్, వర్మ చర్చలు జరిపినట్లు సమాచారం. అనంతరం జగన్ తో కలిసి వర్మ అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు.  సినిమా టికెట్ రేట్ల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో భాగంగా ఓ సారి అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో వర్మ భేటీ అయిన దాఖలాలే లేవు. తాజాగా  ఉన్నట్టుండి వర్మ విజయవాడ రావడం, ఆ వెంటనే జగన్ తో భేటీ అయిన వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 

తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో తాను తీయబోయే సినిమా గురించి కూడా జగన్ కు వర్మ వివరించినట్టు తెలుస్తోంది. అయితే అందరూ అనుకున్నట్లుగా అది పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా కాదని, వైయస్ జగన్ ని హైలెట్ చేస్తూ చేసే సినిమా అంటున్నారు.  ఆ సినిమా యాత్ర 2 టైప్ లో జగన్ పథకాలు గురించి, ఆయన చుట్టూ జరుగుతున్న కుట్రలు గురించి సినిమా ఉండబోతోందని అంటున్నారు.

 అలాగే చిత్రానికి  జగన్నాథ రథ చక్రాలు అనే టైటిల్  పెట్టబోతున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఏదైమైనా 2024 కు ఈ సినిమా రెడీ అవుతుందని అంటున్నారు. మరో ప్రక్క తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం బాలయ్యతో బోయపాటి శ్రీను లెజండ్ తరహాలో ఓ పొలిటికల్ చిత్రం ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఈ రెండు బరిలో పోటీపడే చిత్రాలు అవుతాయని, ఆ సినిమాకు కౌంటర్ గా ఈ సినిమా ఉండాలని భావిస్తున్నట్లు ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఏది నిజమో..ఏది రూమరో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios