Liger:‘లైగర్’డిజిటల్ రైట్స్ కు మైండ్ బ్లోయింగ్ రేటు
ఇప్పటికే లైగర్ టీజర్‌తో తనలోని ఫైర్‌ను చూపించిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలో పెరిగిన క్రేజ్ కు అణుగుణంగా ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన సినిమాలకు గ్యాప్ వచ్చింది. చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జగన్నాధ్ సినిమా చేసే ఛాస్తున్నాడు విజయ్ దేవరకొండ. పూరీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రమే 'లైగర్'. ఈ మూవీ ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇప్పటికే లైగర్ టీజర్‌తో తనలోని ఫైర్‌ను చూపించిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ నేపధ్యంలో పెరిగిన క్రేజ్ కు అణుగుణంగా ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు దాదాపు రూ.98 కోట్లకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ రెండూ హాట్ స్టార్ తీసుకుంది. ఇందులో 65 కోట్లు కేవలం ఓటిటి నిమిత్తమే అంటున్నారు. హిందీ,తెలుగు,తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ రేటు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 160 కోట్లు బడ్జెట్ అయ్యిందని, ఇలా నాన్ థియేటరికల్ రైట్స్ నుంచే రూ.98 కోట్లు తెచ్చుకొందంటే మాగ్జిమం రికవరీ అయ్యినట్లే.కనీసం ట్రైలర్ కూడా విడుదల కాని ఒక మూవీకి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా చేస్తోంది.
ఇక ఈ రోజు ట్రైలర్ రిలీజ్ . ఆ ట్రైలర్ ఖచ్చితంగా మాస్ ని టార్గెట్ చేస్తూ సాగుతుంది. దాంతో థియేటర్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడతారు. దాంతో థియేటరికల్ రైట్స్ ఓ రేంజిలో పలుకుతాయని ట్రేడ్ లో వినపడుతోంది.
అయితే ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 75 అడుగుల విజయ్ కటౌట్‌ను పెట్టారు ఫ్యాన్స్. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ పోరడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ. హీరోగా విజయ్ దేవరకొండకు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాలో సునీల్ శెట్టి (Sunil Shetty) డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట. తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని సమాచారం.