Samantha:మబ్బులు వీడాయి..సమంత ముంబై ట్రిప్స్ సీక్రెట్ రివీల్

సమంత విడాకులుకు ముందు నుంచి ముంబై లో ఎక్కువగా గడుపుతోంది. అక్కడవారితో టచ్ లో ఉంటోంది. ముంబై ..హైదరాబాద్ ప్రయాణాలు పెట్టుకుంటోంది. అందుకు కారణమేమిటి అనేది మీడియా వర్గాలకు అంతు చిక్కలేదు. అయితే ఇప్పుడు ఆ గుట్టు వీడింది. అదేమిటంటే..

Reason behind Samantha sudden Mumbai Trips


సమంత పర్శనల్ లైఫ్ ని ప్రక్కన పెడితే మొదటి నుంచి తన కెరీర్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఆచి,తూచి అడుగులు వేస్తోంది. తెలుగు,తమిళ భాషలనను ఏలిన ఆమె దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. అందుకోసం ఆమె పక్కా వ్యూహ రచన చేసిందని సమాచారం. అది ఇప్పుడు ఫలిస్తోందంటున్నారు. ఈ విషయాలను ఆమె చాలా సీక్రెట్ గా ఉంచింది.

ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క హిందీలో అవకాశాలపై దృష్టిపెట్టింది సమంత. ముంబయితో నిత్యం టచ్‌లో ఉంటూ పక్కా ఫ్లానింగ్ తో ముందుకు వెళ్లింది.  సల్మాన్‌ఖాన్‌తో కలిసి సమంత నటించబోతోందనేది బాలీవుడ్‌ వర్గాల మాట. తాను హీరోగా నటించిన ఓ సూపర్ సినిమాకి సీక్వెల్‌ చేస్తున్నారు సల్మాన్‌. అందులో దక్షిణాదితో పాటు హిందీ ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ అయితేనే బాగుంటుందని భావించారని తెలిసింది. సమంతకే ఆ అవకాశం దక్కిందని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉండగా..జాతీయస్థాయిలో బుల్లితెరపై ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహర్ హోస్ట్ గా వ్యవహరించే ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా అనేకమంది సెలబ్రిటీలు హాజరై అలరించారు. తాజాగా, 'కాఫీ విత్ కరణ్' ఏడో సీజన్ ప్రారంభం కానుంది. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ జులై 7న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్ కు సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ హాజరుకానున్నారు.

కాగా, ఈ షోకి దక్షిణాది ముద్దుగుమ్మ సమంత కూడా హాజరుకానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్'లో సందడి చేయనుంది. అయితే ఈ జోడీ టాక్ షోకి వస్తారన్నదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

ఇక సమంత తెలుగులో విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కూడా విడుదలకి ముస్తాబవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios