RRR:రామ్ చరణ్, అలియాభట్ డ్యూయిట్ తొలిగింపు, కారణం అదే?
సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ చేసింది. ఈ జోడి తెరపై మ్యాజిక్ చేస్తుందంటున్నారు. అయితే వీరిద్దరి మధ్యన చిత్రీకరించిన డ్యూయిట్ తీసాసారనే వార్త వైరల్ అవుతోంది
ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ చేసింది. ఈ జోడి తెరపై మ్యాజిక్ చేస్తుందంటున్నారు. అయితే వీరిద్దరి మధ్యన చిత్రీకరించిన డ్యూయిట్ తీసాసారనే వార్త వైరల్ అవుతోంది.
ఇక మొదట ఆలియా వచ్చినప్పుడు కేవలం ఆమె సోలో సన్నివేశాల చిత్రీకరణ చేపట్టిన జక్కన్న.. ఆ తర్వాత రామ్‌చరణ్, ఆలియా భట్ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఈ ఇద్దరితో ఓ రొమాంటిక్ డ్యూయెట్ కూడా ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ వేశారని, ఇందులోనే రామ్‌చరణ్, ఆలియా భట్‌లపై సన్నివేశాలు చిత్రీకరించి వీరిద్దరికి సంబంధించిన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు సినిమాలో ఆ డ్యూయిట్ ఉండదని అంటున్నారు.
ఎడిటింగ్ ఫైనల్ కట్ లో సినిమా రన్ కు అడ్డం అవుతోందని రాజమౌళి ఈ సాంగ్ ని తొలిగించారని మీడియాలో ప్రచారం అవుతోంది. అలాగే సినిమా లెంగ్త్ ఇప్పటికే ఎక్కువైందని, పాట కూడా కలిస్త కష్టమవుతుందని భావించారట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక, ఆ పాటను కలిపే అవకాసం ఉందంటున్నారు.
భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీపై దేశవిదేశాల్లో ఉన్న అభిమానులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
సినిమా గురించి రామ చరణ్ మాట్లాడుతూ.... "దానయ్యగారు మోస్ట్ డైనమిక్ ప్రొడ్యూసర్ .. ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. కీరవాణిగారు చాలా గొప్ప సంగీతాన్ని అందించారు. ఆయన వర్క్ చేసిన ఈ సినిమాలో నేను ఉండటమనేది గర్వకారణంగా భావిస్తాను. ప్రతి పాట చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రాజమౌళి గారి టీమ్ లోని ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించారు.