Prabhas: ప్రభాస్ క్యాప్ వెనుక ఇంత కథుందా?!
‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ క్యాప్ పెట్టుకుని వచ్చాడు. ఈవెంట్ ముగిసేవరకు క్యాప్ తోనే కనిపించాడు. కళ్ళజోడు కూడా అస్సలు తీయలేదు. అలా ప్రభాస్ ఎందుకు చేసాడనేది చర్చనీయాంశంగా మారింది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందులో కొన్ని మీకు అందిస్తున్నాము.
స్టార్ హీరోలు పబ్లిక్ లో కనపడినప్పుడు వారి ప్రతీ విషయం స్కానింగ్ కు గురి అవుతుంది. వారు ఏ రంగు చొక్కా వేసుకున్నారు..వాళ్లు థరించిన వాచ్ ఖరీదు ఎంత...వాళ్లు వేసుకొచ్చిన కారు కథేంటి ఇలా....ఇప్పుడు ప్రభాస్..క్యాప్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే...
నిన్న జరిగిన ‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకని చాలా సింపుల్ గా ఏర్పాటు చేసిన సంగతి తెలసిందే. గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో ఇది బిగ్ ఈవెంట్ గా ప్రొజెక్టు అయ్యింది. ఈ వేడుకలో సినిమా గొప్పతనం గురించి, థియేటర్ గొప్పతనం గురించి.. ప్రభాస్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ‘సీతా రామం’ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ క్యాప్ పెట్టుకుని వచ్చాడు. ఈవెంట్ ముగిసేవరకు క్యాప్ తోనే కనిపించాడు. కళ్ళజోడు కూడా అస్సలు తీయలేదు. అలా ప్రభాస్ ఎందుకు చేసాడనేది చర్చనీయాంశంగా మారింది.
మీడియాలో వినపడుతున్న దాని ప్రకారం ..ప్రభాస్ ..క్యాప్ తో ఉండటానికి కారణం ...అతని హెయిర్ స్టెయిల్ బయిటకు తెలియకూడదనే అంటున్నారు. ఆయన లాంగ్ హెయిర్ కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుంది. ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ తో పాటు ‘ఆది పురుష్’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రఘు రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకోసం ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపించాల్సి ఉంది. షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ కొంత ప్యాచ్ వర్క్ చేస్తున్నారట.
ఇప్పటివరకు ‘ఆదిపురుష్’ నుండి ప్రభాస్ లుక్ కు సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అలాగే రాముని పాత్ర కోసం ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపించాలి. తన లుక్ రివీల్ కాకుండా ప్రభాస్ ఇలా క్యాప్ పెట్టుకుని వచ్చాడని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క ...ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో హెయిర్ కు సంభందించిన గెటప్ అని చెప్తున్నారు. ఇక ప్రాజెక్టు కె చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ ‘స్వప్న సినిమా’ బ్యానర్ల పై అశ్వినీదత్, స్వప్న దత్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం.