Prabhas:ప్రభాస్ 'రాజా డీలక్స్‌' టైటిల్ వెనక ఇంట్రస్టింగ్ కహానీ


మీడియం బడ్జెట్ సినిమాలు చేసుకునే  డైరెక్టర్‌ మారుతికు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచింది. పైగా అది మారుతి మార్క్ ఉన్న కామెడీ సినిమా అని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ పేరు 'రాజా డీలక్స్' అంటూ టాక్ వినిపిస్తోంది.
 

Real story behind Prabhas Raja Deluxe title


పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా రిజల్ట్ ప్రక్కన పెడితే ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతీ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ  చిత్రం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్‌' అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ టైటిల్ బయిటకు రావటం వెనక ఓ ఆసక్తికరమైన కథ నడిచిందని సమాచారం.

అసలు మ్యాటర్ ఏంటంటే... ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా అది నిజం కాదు. మారుతి ఈ టైటిల్ ని అనుకున్నది నిజమే. అయితే అది ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్‌ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరిగాయి.  ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. అనుకోకుండా అది బయిటకు రావటం, ప్రభాస్ తో సినిమా అనుకోవటంతో ఇదే టైటిల్ అని మీడియా ప్రచారం మొదలెట్టేసింది.

మారుతి ఇప్పటివరకు మినిమమ్ గ్యారెంటీ హీరోలతో, మినిమమ్ గ్యారెంటీ కథలతోనే సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటివరకు తను ఒక్క స్టార్ హీరోను కూడా డైరెక్ట్ చేయలేదు.   మీడియం బడ్జెట్ సినిమాలు చేసుకునే  డైరెక్టర్‌ మారుతికు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచింది. పైగా అది మారుతి మార్క్ ఉన్న కామెడీ సినిమా అని కూడా ప్రచారం సాగుతోంది. 

ఇక   ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని టీమ్ బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్‌ను త్వరలోనే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ హార్రర్ కామెడీ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. వారిలో రాశీ ఖన్నా, మాళవికా మోహనన్, శ్రీలీలా హీరోయిన్లుగా ఫిక్స్ అయినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి.దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios