#RC15:చరణ్ - శంకర్ సినిమాలో భారీ మార్పు, ఏమైనా గొడవ లేక...?
తొలి తమిళేతర దక్షిణాది హీరో రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భాభారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ చిత్రానికి సంభందించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఆర్ట్ డైరక్టర్ మార్పు.
ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా రామకృష్ణ పనిచేస్తున్నారు. దర్శకుడు శంకర్ తో క్రియేటివ్ డిఫరెన్స్ లు రావటంతో ఆయన్ని తప్పించి ఆ ప్లేస్ లో కి రవీంద్రా రెడ్డి తీసుకువచ్చారని వినికిడి. రవీందర్ రెడ్డి గతంలో రామ్ చరణ్ 'మగధీర'కు పని చేశారు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఇక చిత్రం షూటింగ్ విషయాలకి వస్తే... అమృత్‌సర్‌లో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ పాల్గొనగా ఒక షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత విశాఖలో కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అంతకు ముందు రాజమండ్రిలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. సుమారు 50 శాతం సినిమా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ సమయంలో టెక్నీషియన్స్ మార్పు అనేది ఇండస్ట్రీలో చాలా మందికి ఆశ్చర్యపరిచింది. ఏదో పెద్ద ఇష్యూ లేదా గొడవ అయ్యి ఉంటుందని అంతా భావిస్తున్నారు.
రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి.