Asianet News TeluguAsianet News Telugu

Ravi Teja: రవితేజ నిజంగా ఈ పనిచేస్తే...మెచ్చుకోని వారుండరు

 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.10 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.

Ravi Teja promises the compensation to Ramarao On Duty producer
Author
Hyderabad, First Published Aug 2, 2022, 4:18 PM IST


ఈ ఏడాది  మొదట్లో 'ఖిలాడీ' అనే మూవీతో పలకరించిన రవితేజ.. తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని విధంగా మొదటి ఆట నుంచి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది.  ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో కేవలం రూ. 3.87 కోట్లు రాబట్టింది.  కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 31 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 45 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.10 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.  

ఈ నేపధ్యంలో రవితేజ ఆ నిర్మాత ఆర్దికంగా కోలుకునేందుకు తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చాడని వినపడుతోంది. అలాగే  ఫైనాన్సియల్ గా హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారట. అలాగే రెమ్యునరేషన్  విషయంలో పట్టింపు లేకుండా నెక్స్ట్ మూవీ చేసి పెడతాననీ, బడ్జెట్ తక్కువలో చేయడానికైనా తాను రెడీగానే ఉంటానని ఆయనకి రవితేజకి మాట ఇచ్చాడని వినిపిస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన ఏమీ లేదు. కేవలం సోషల్ మీడియాలో వినపడుతున్న మాటలేనా లేక నిజమా అని తెలియాల్సి ఉంది. నిజమే అయితే నిర్మాత ఒడ్డున పడినట్లే.

ఇక సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న 'దసరా' అయినా ఆయనను నిలబెట్టాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంతకుముందు ఆయన నిర్మించిన 'పడిపడిలేచే మనసు' .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'విరాట పర్వం' సినిమాలు ఆర్థికపరమైన నష్టాలను తీసుకుని వచ్చాయి. అయినా బడ్జెట్ కి వెనకాడకుండా ఆయన 'రామారావు' సినిమాను నిర్మిచారు. అది మరింత నష్టపరిచిందనే టాక్ వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios