#Rc15: రామ్ చరణ్, శంకర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్ జరుగుతోంది.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. ఈ సినిమాకి ఇప్పటివరకూ ‘విశ్వంభర’, ‘సర్కారోడు’ అనే టైటిల్స్ వినిపించాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్సైందని సమాచారం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 30 మార్చి 2023 (శ్రీరామ నవమి) రోజు రిలీజ్ కానుంది. వరసగా 7 శెలవలు వస్తన్నాయి మార్చి 30 నుంచి ఏప్రియల్ 7 దాకా శెలవులు ఉండటంతో ఆ డేట్ నే ఫైల్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ కు షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీ కానుంది. రామ్ చరణ్ కెరీర్ లో పెద్ద హిట్స్ గా నిలిచిన రంగస్దలం, ఆర్ ఆర్ ఆర్ కూడా మార్చి నెలలో రిలీజ్ కావటం కూడా సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం పంజాబ్ లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్ జరుగుతోంది. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రాఫర్. అయితే ఈ పాట ఇక్కడితోనే పూర్తవదట. ఈ పాట కొనసాగింపు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కూడా జరుగుతుందని తెలిసింది. జూలై 10లోపు ఈ పాటను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్.
ఈ పాట పూర్తి కాగానే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను శంకర్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ యాక్షన్ సీన్‌లో దాదాపు 1200మంది ఫైటర్స్ పాల్గొంటారట. దాదాపు 20 రోజుల పాటు ఈ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుందని భోగట్టా. ఈ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్ 75 శాతం పూర్తవుతుందట. ఆ తర్వాత షూట్ కోసం విదేశాలు వెళ్లనుంది యూనిట్. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ 95 శాతం పూర్తవుతుందని తెలిసింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.