చరణ్ తప్పించుకున్న దెబ్బ అఖిల్ కు పడిందా?
చరణ్ తో ఉన్న స్నేహం కారణంగానే ఆయనతో సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమాను చేయాలనుకున్నాడట. అయితే ఆ టైమ్ లో చరణ్ ఇటు 'ఆర్ ఆర్ ఆర్' .. ..
ఒక హీరోకు అనుకున్న కథను మరో హీరోతో చేయటం ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగే విషయం. ఆ సినిమా సక్సెస్ అయితే ..అయ్యో మనం చేయాల్సిందే అనిపిస్తుంది. అది పోతే ..తప్పించుకున్నట్లా...ఇప్పుడు ఇలాంటి టాపిక్కే సోషల్ మీడియాని ఊపేస్తోంది. అఖిల్ తాజా చిత్రం ఏజెంట్ డిజాస్టర్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఆ సినిమాని మొదట ఎవరు చేద్దామనుకున్నారు..దాని పూర్వ పరాలు ఏమిటనేది తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏజెంట్ చిత్రం గురించి ఓ విశేషం బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది.
అఖిల్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలిన 'ఏజెంట్' కథ ముందుగా చరణ్ విన్నారని వినిపిస్తోంది. ధృవ చేసిన నాటి నుంచీ సురేందర్ రెడ్డికి .. చరణ్ కి మధ్య మంచి ర్యాపో ఉంది. అందుకే ఆ తర్వాత తన తండ్రితో 'సైరా' చేయడానికి అవకాశం ఇచ్చాడు. చరణ్ తో ఉన్న స్నేహం కారణంగానే ఆయనతో సురేందర్ రెడ్డి 'ఏజెంట్' సినిమాను చేయాలనుకున్నాడట. అయితే ఆ టైమ్ లో చరణ్ ఇటు 'ఆర్ ఆర్ ఆర్' .. అటు 'ఆచార్య సినిమాలతో బిజీగా ఉండటం, అప్పటికే శంకర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన చేయలేనని చెప్పాడట.
ఈ క్రమంలోనే ఆ కథను పట్టుకుని అఖిల్ దగ్గరికి సురేందర్ రెడ్డి వెళ్లాడని చెబుతున్నారు. సురేందర్ రెడ్డిపై గల నమ్మకంతో నాగార్జున ఓకే చెప్పారు. ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. సినిమా రిలీజ్ కు ముందు చరణ్ తో ఆడియో కూడిన టీజర్ సైతం వదిలారు. ఇక దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. నెగటివ్ టాక్ తో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. దీంతో చాలా థియేటర్స్ లో నుంచి ఈ సినిమాని తీసేస్తున్నారు. దాంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లీవ్ సంస్థ మే 19న ఓటీటీలో ఏజెంట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్లు వెల్లడించింది. అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే విడుదలైన నాలుగు రోజులకే అనిల్ సుంకర సంచలన ప్రకటన చేశారు. ‘‘ఈ సినిమాకి చాలా పెద్ద తప్పు చేశాం. అది బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లడమే’’ అని ట్వీట్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, రావు రమేష్, డినో మోరియో, సాక్షి వైద్య తదితరులు ‘ఏజెంట్’ లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అయింది.