Ram Charan:రామ్ చరణ్ అంత తెలివి తక్కువ పని చెయ్యడే, రూమరే అయ్యింటుంది

రామ్ చ‌ర‌ణ్ త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో ఓ మూవీని చేస్తున్నారు. కాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. ఈ సినిమా కెరియర్ పరంగా చరణ్ కి 15వ సినిమా. ఇక దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. 

Ram charan film has been fixed as Sarkarodu


ఓ పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతోందంటే రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తాయి. వాటిలో కొన్ని నిజం కావచ్చు. ఎక్కువ శాతం ఊహాకథనాలే అవుతాయి. తాజాగా మీడియాలో రామ్ చరణ్ తాజా చిత్రం టైటిల్ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో నిజం లేదు అంటున్నారు.  ఏమిటా వార్త...వివరాల్లోకి వెళితే...

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇటీవల పుణేలో తొలి షెడ్యూల్‌ పూర్తవగా ప్రస్తుతం రాజమండ్రిలో RC15 టీం సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ టైటిల్‌ ఖరారైందని, రామ్‌ చరణ్‌ బర్త్‌డే రోజున ఈ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు మీడియాలో  ప్రచారం జరుగుతోంది. మార్చి 27 రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. 

అయితే ఈ వార్తలో నిజం ఉండే అవకాసం లేదంటన్నారు. అందుకు కారణం ఈ టైటిల్ అల్లు అర్జున్ చిత్రం టైటిల్ సరైనోడు ని గుర్తు చేయటం. అలాగే మహేష్ తాజా చిత్రం సర్కారు వారి పాట లో నుంచి తీసుకున్నట్లు ఉండటం. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని రామ్ చరణ్ ఓకే చెయ్యండంటున్నారు. 

ఇక  ఈ చిత్రంలో లో రామ్‌ చరణ్‌ సివిల్‌ సర్విసెస్‌ అధికారిగ కనిపించనున్నట్లు ముదటి నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమం రోజున రిలీజ్‌ చేసిన ఈ తొలి పోస్టర్‌లో రామ్‌ చరణ్‌, కియార అద్వాని, డైరెక్టర్‌ శంకర్‌, దిల్‌ రాజు, శ్రీకాంత్‌తో సహా మిగతా క్రూ అంతా సూటు బూటు ధరించి ఆఫిసర్స్‌ లుక్‌లో కనిపించారు.  ఈ మూవీలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అద్వాని నటిస్తుండగా.. శ్రీకాంత్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios