Asianet News TeluguAsianet News Telugu

#GodFather:దిల్ రాజుపై కోప్పడ్డ రామ్ చరణ్? థియేటర్స్ సమస్య?

గాడ్ ఫాధర్  కొన్ని  కీలకమైన ఏరియాలను వేరే వాళ్లు తీసుకుని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కొన్నిసమస్యలు వచ్చాయని, రామ్ చరణ్ స్వయంగా సీన్ లోకి వచ్చి సమస్య పరిష్కరించారని తెలుస్తోంది.

Ram Charan angry on Dil raju for GodFather Release?
Author
First Published Sep 27, 2022, 11:23 AM IST


 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఈ సినిమాకి సంబంధించి అన్ని ఏరియాలకు సొంత రిలీజ్ జరుగుతోందని అన్నారు. కానీ ఇప్పుడు కొన్ని  కీలకమైన ఏరియాలను వేరే వాళ్లు తీసుకుని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కొన్నిసమస్యలు వచ్చాయని, రామ్ చరణ్ స్వయంగా సీన్ లోకి వచ్చి సమస్య పరిష్కరించారని తెలుస్తోంది.

గాడ్ ఫాధర్ సినిమా బిజినెస్, రిలీజ్ వ్యవహారం గత కొద్ది రోజులుగా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు మెగా క్యాంప్ కు మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, దాంతో వేరే  నైజాం ఏరియాని వేరే కొత్త వారు ఫ్యాన్సీ ఆఫర్ తో  తీసుకున్నారు.అయితే వాళ్లకు  థియేటర్స్ నెట్ వర్క్ లేకపోవటంతో ఏషియన్ సునీల్ కు అప్పచెప్పటం జరిగింది. ఇది దిల్ రాజు బాగా కోపం తెప్పించని చెప్తున్నారు.అది  గాడ్ ఫాధర్  ...హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ లో  థియేటర్ సమస్యకు దారితీసిందని వినికిడి.  

డబ్బింగ్ సినిమా పొన్నియన్ సెల్వన్ కు ఆర్టిసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ కేటాయించారు. ఆ థియేటర్ కావాలని గాడ్ ఫాధర్ టీమ్ భావించింది. ఇదంతా తెలుసుకున్న రామ్ చరణ్ కోపం తెచ్చుకున్నారట. తాను స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడాక సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయంటున్నారు.  రామ్ చరణ్ జోక్యంతో ఈ థియేటర్ల సమస్య  సర్దు మణిగి,  గాడ్ ఫాధర్ కు సుదర్శన్ థియేటర్  కేటాయింపు జరిగిందని,  #ps1 ని  దేవీ థియేటర్ కు మార్చారని తెలుస్తోంది.

 మరో ప్రక్క రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారు. ఎంత మొత్తమనేది బయటకు రాలేదుత్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.
  
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.  ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios