RRR OTT:‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓటీటీ రిలీజ్ డేట్ , అంత తొందరగానా?
ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
సోమవార పరీక్షలో పాసైపోయి ముందుకు దూకుతోంది ఆర్.ఆర్.ఆర్. ఈనెల 25న `ఆర్.ఆర్.ఆర్` విడుదలైన మార్నింగ్ షోకు డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వీకెండ్ తొలి మూడు రోజుల్లో రికార్డు వసూళ్లు సాధించింది ..బాక్సాఫీసుని షేక్ చేసింది. అయితే సోమవారం ఈ సినిమా పరిస్థితేంటని రకరకాల లెక్కలు వేసారు. వీకెండ్ పూర్తయ్యాక...ఎంత పెద్ద సినిమా అయినా, సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అవుతూంటాయి. సాధారణంగా సగానికి సగం పడిపోతాయి. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’కు సోమవారం కూడా మంచి వసూళ్లనే రాబట్టింది..ఆర్.ఆర్.ఆర్. నాలుగో రోజు దాదాపుగా రూ.17.5 కోట్లు సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ పై ఓ ఇంట్రస్టింగ్ వార్త బయిటకు వచ్చింది.
ఇప్పటికే రెండు మూడు సార్లు..వెండితెరపై ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎంజాయ్ చేసిన అభిమానులు...ఇక డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూడు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుందంటూ మీడియాలో ప్రచారం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్ జీ5లో విడుదల కాగా.. హిందీ వెర్షన్‌ను నెటిఫ్లీక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వినికిడి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్ వినపడుతోంది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను 2 నెలల్లోనే ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మే 25వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. అయితే హిందీ వెర్షన్ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకి రూ.600 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇదే ఫ్లో, రన్ కంటిన్యూ అయితే ఈ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డివైడ్ టాక్ వచ్చినా, బాలీవుడ్ ఈ సినిమా గురించి అంతగా పట్టించుకోకపోయినా - ఈ స్థాయి వసూళ్లు రావడం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించే అంశం.