Pushpa 2 : ‘పుష్ప : ది రూల్’ పై ఇది ఫేక్ న్యూసేనా?

పెద్ద సినిమాలపై రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తూంటాయి. అందులో ఏది నిజమో..ఏది అబద్దమో చాలా సార్లు క్లారిటీ రావటం చాలా కష్టం. ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2 పై మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం బడ్జెట్ గురించి, రెమ్యునరేషన్ గురించిన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్త పై సోషల్ మీడియాలో చర్చలు జరుగున్నాయి.  వివరాల్లోకి వెళితే...

Pushpa 2 Big News Turns Out To Be False

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప :  ది రైజ్’ (Pushpa the rise) పాన్ ఇండియా చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదెలే డైలాగ్ నుండి సామి సామి పాట వరకు ప్రతీ పాట, ప్రతీ డైలాగ్ భారీగా పాపులర్ అయ్యాయి. దీంతో   అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. విడుదలైన అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళు సాధించి.. కొత్త రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ పుష్ప కేరక్టరైజేషన్.. ప్రేక్షకులకు మ్యానియాగా మారింది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, అలాగే.. సినిమా కథాంశం విషయంలో వచ్చిన విమర్శల్ని పరిగణనలోకి తీసుకుని సుకుమార్ అండ్ టీమ్.. స్ర్కిప్ట్ లో అవసరమైన మార్పులు చేస్తున్నారని సమాచారం. ప్రేక్షకులకు వరుస సర్ ప్రైజుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం బడ్జెట్ గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది.

 పుష్ప పార్ట్ 2 మూవీ రూ. 400 కోట్ల బడ్టెట్‌తో తెరకెక్కనుందని, జూలై 2022 లో పట్టాలెక్కనున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవి సెలవులు నాటికి విడుదల కానుందని  అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అందులో 100 కోట్లు అని చెప్తున్నారు.   అయితే ఇది  అధికారిక ప్రకటనలు కాదు. మీడియాకు వచ్చిన లీక్ అయ్యండవచ్చు లేదా మీడియా సృష్టి అయ్యిండవచ్చు అనేది నిజం.  అందులో రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ అనే వివరాలు మాత్రం నెటిజెన్స్‌లో చర్చకు దారితీశాయి. ఇది ఫేక్ న్యూస్ లేదా రూమర్ అయ్యిండవచ్చు అంటున్నారు.

పుష్ప ది రైజ్ సినిమా టోటల్ రన్‌లోనే రూ. 400 కోట్ల వసూళ్లు సాధించలేదని.. అటువంటప్పుడు పుష్ప ది రూల్ కోసం అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ వెచ్చించి సినిమా ఎలా తీస్తారంటూ కొంతమంది నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా... ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రకోసం తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని ఎంపిక చేశారని టాక్. మొదటి భాగం చివరిలో భన్వర్ సింగ్ షకావత్ పాత్రను ఎంటర్ చేసి..  ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టేసిన దర్శకుడు సుకుమార్ (Sukumar).. రెండో భాగంలోనూ అదే మ్యాజిక్ ను కంటిన్యూ చేయబోతున్నారు.  భన్వర్ సింగ్, పుష్ప పాత్రల మధ్య విరోధమే ప్రధానంగా రెండో భాగం ఉండనుందట. అలాగే.. విజయ్ సేతుపతి పాత్రతో సినిమాకి మరింతగా ఇంటెన్సిటీని క్రియేట్ చేయబోతున్నారట. 

ఇందులో అతడో సీనియర్  పోలీసాఫీసర్ గా నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ అండ్ టీమ్ స్క్రిప్ట్ కు తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ‘పుష్ప 2’ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. సునీల్, అనసూయ, ధనుంజయ పాత్రలు రెండో భాగానికి మరింత కీలకం కాబోతున్నాయట. రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) హీరోయిన్ గా రెండో భాగంలోనూ కంటిన్యూ అవుతుండగా... ఇందులో ఆమె పాత్ర చనిపోతుందనే వార్తల్ని ఖండించారు మేకర్స్.

 దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) మ్యూజికల్ మ్యాజిక్ ఈ భాగంలోనూ కొనసాగనుంది. ఇందులో కూడా ఒక అదరిపోయే ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. అలాగే.. మొదటి భాగాన్ని మించే స్థాయిలో పాటలు ఉండనున్నాయని టాక్. సాధారణ గంధపు చెక్కల కూలి.. సిండికేట్ కు బాస్ గా ఎదిగడం మొదటి భాగమైతే.. తన సామ్రాజ్యాన్ని ఎలా ఏలబోతాడు అన్నది రెండో భాగం కథాంశం. ఆ క్రమంలో పుష్ప రాజ్ ఎదుర్కొన్న సవాళ్ళు.. సినిమాకే హైలైట్ కానున్నాయని చెప్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios