RRR:రాజమౌళి ఇలా చేసాడేంటి,ప్రింట్ మీడియా మండిపాటు?
`ఆర్.ఆర్.ఆర్` టీమ్ ఏ న్యూస్ పేపర్‌కీ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. `బాహుబలి` టైమ్ లో `ఈనాడు` లో పెద్ద పెద్ద ఇంటర్వూలు వచ్చాయి. ఇప్పుడు ఈనాడుతో అన్నిటినీ ప్రక్కన పెట్టేసారు. ఫోనీ టీవీ ఛానళ్లకు స్పెషల్ ఇంటర్వూలు ఇచ్చారా అంటే..ఒకళ్లు ఇద్దరికి తప్ప మిగతావారికి తాము చేసిన ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఒకప్పుడు ప్రింట్ మీడియాకే ప్రయారిటీ ఉండేది. వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ప్రింట్ మీడియా ప్రయారిటీ తగ్గిపోయింది. ఎందుకంటే ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలు ముందు రోజే వెబ్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చేస్తున్నాయి. అయితే ఆ మీడియాకు ఉన్న ప్రయారిటీ,విలువ జనాల్లో పోలేదు. ఇప్పటికీ చాలా మంది ప్రొద్దున్నే పేపరు చదివే పనులు మొదలెడతారు. ఈ విషయాలు రాజమౌళికు తెలియనవి కాదు. అయితే ఆయన, టీమ్ ప్రింట్ మీడియాను పట్టించుకేలోదు. `ఆర్.ఆర్.ఆర్` ప్రమోషన్స్ లో ప్రింట్ మీడియాకు ప్లేస్ కనపడలేదు. అప్పటికీ రోజూవారి ప్రింట్ మీడియా కవరేజ్ ఇస్తూనే ఉంది.
`ఆర్.ఆర్.ఆర్` టీమ్ ఏ న్యూస్ పేపర్‌కీ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. `బాహుబలి` టైమ్ లో `ఈనాడు` లో పెద్ద పెద్ద ఇంటర్వూలు వచ్చాయి. ఇప్పుడు ఈనాడుతో అన్నిటినీ ప్రక్కన పెట్టేసారు. ఫోనీ టీవీ ఛానళ్లకు స్పెషల్ ఇంటర్వూలు ఇచ్చారా అంటే..ఒకళ్లు ఇద్దరికి తప్ప మిగతావారికి తాము చేసిన ఇంటర్వ్యూలు ఇచ్చారు. స్పెషల్ కవరేజ్ లేదు. ఇక ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు సరికదా.. వాళ్లకు రెగ్యులర్ గా ఇచ్చే యాడ్లు కూడా ఇవ్వక పోవటం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి ప్రింట్ మీడియా మాత్రం కాస్త కోపంగానే వుందని సమాచారం.
ఇక 2022లో రాబోతున్న అతి పెద్ద సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ ఒకటి. ఈ సినిమాకోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆర్.ఆర్.ఆర్ ఈ రోజు రాత్రి పన్నెండు దాటాకా స్పెషల్ షోలతో విడుదల కాబోతోంది. ఇది పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ నుంచి భారీ వసూళ్లను ఆశిస్తున్న ఈ తరుణంలో అక్కడ పెద్దగా రెస్పాన్స్ రావటం లేదు. రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టి పుంజుకుంటుంది అని భావిస్తున్నారు.
ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. . ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజు రాత్రి నుంచి స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.