Prabhas:షాకింగ్.. ఆగిన ‘సలార్’ షూటింగ్.. ? టెన్షన్ లో ఫ్యాన్స్

  ఈ చిత్రం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 60 శాతం షూటింగ్ కూడా పూర్తవలేదని ఇటీవల నిర్మాత తెలిపారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. మరో ప్రక్క ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా ప్రభాస్ అనే అంటున్నారు.

Prabhas Salaar Movie shooting postponed?


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో  తన నెక్ట్స్ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి, రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. అయితే అది మారుతితో చేసే చిత్రమా,  సలార్ చిత్రమా అనేది క్లారిటీ లేదు. దాంతో  డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన నెక్ట్స్ చిత్రంగా ఏ సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘ఆదిపురుష్’ చిత్రం ముందుగా రిలీజ్ అవుతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ‘సలార్’ కూడా రిలీజ్‌ను చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఎందుకంటే యాక్షన్ ఎంటర్టైనర్ అయితే వెంటనే కనెక్ట్ అయ్యి..పడిపోతున్న ప్రబాస్ మార్కెట్ ని, క్రేజ్ ని నిలబెడుతుందని  ఆలోచనగా చెప్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా షూట్ కు బ్రేక్ లు పడినట్లు సమచారం.

ఈ వార్త బయిటకు రావటంతో  డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి రావటం గ్యారెంటీ అంటున్నారు. దాంతో ఈ చిత్రం అప్డేడ్స్ కోసం సోషల్ మీడియాలో ప్యాన్స్ రచ్చ మొదలెట్టేసారు.  అయితే ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమా లేటయ్యేటట్లు ఉందని, దీనికోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదని వినికిడి.

అందుకు కారణం  ఈ చిత్రం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 60 శాతం షూటింగ్ కూడా పూర్తవలేదని ఇటీవల నిర్మాత తెలిపారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. మరో ప్రక్క ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా ప్రభాస్ అనే అంటున్నారు.

రాధేశ్యామ్ సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్   విదేశాలకు వెళ్లాడని విషయం తెలిసిందే. ప్రభాస్‌ యూరప్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్నాడని, రెండు నెలల వరకు కెమెరా ముందుకురావడం కష్టమని చెప్తున్నారు.  దీంతో సలార్ సినిమా షూటింగ్ కు బ్రేక్ లు వేయటం తప్ప మేకర్స్ కి వేరే ఛాన్స్ లేదనేది నిజం. అందుకే రెండు నెలలు పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు  తెలుగు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ ఈ రేంజ్ లో ఆలస్యం జరిగితే వచ్చే ఏడాది చివరకి వచ్చే అవకాసం ఉందంటున్నారు.

 ఆదిపురుష్ 3D చిత్రం కావడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి, సలార్ చిత్రంపై ఫోకస్ పెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను ఏప్రిల్ నెలలో జరుపుకోవాలని.. ఈ సినిమాను ఈ యేడాది చివరినాటికి పూర్తి చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ నిర్ణయంతో సలార్ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. అయితేఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios