Prabhas:థియేటర్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ప్రభాస్ ఓకే చెప్పేసాడు
ఈ మేరకు ఓ థియేటర్ సెట్ ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట. అందులోనే దాదాపు షూటింగ్ మొత్తం జరుగుతుందని చెప్తున్నారు. ఈ సినిమా మొత్తం రెండు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందతోందా లేదా అనే విషయం గత కొద్ది రోజులుగా మీడియాలో నలుగుతోంది. ముఖ్యంగా పక్కా కమర్షియల్ చిత్రం ఫ్లాఫ్ అయ్యిన తర్వాత ఈ ప్రాజెక్టు జరిగేదికాదులే అని ఫ్యాన్స్ ఫిక్సై పోయారు. దానకి తోడు గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్...ప్రభాస్ ని ఉద్దేశించి..మారుతి డైరక్షన్ లో సినిమా చేయద్దు..నీ స్టార్ డమ్ ని తగ్గించుకోవద్దు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే ప్రభాస్ తను నమ్మింది ఏదో తను చేసుకుపోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే అఫీషియల్ గా లాంచ్ అవ్వబోతోంది.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే... సినిమా మొత్తం ఓ పురాతన భవంతి చుట్టూ తిరుగుతుందని చెప్పేది మాత్రం నిజం కాదని తెలుస్తోంది. రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టు ఈ సినిమా కథ జరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓ థియేటర్ సెట్ ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట. అందులోనే దాదాపు షూటింగ్ మొత్తం జరుగుతుందని చెప్తున్నారు. ఈ సినిమా మొత్తం రెండు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా అనుష్క మాళవిక మోహనన్ నటించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. మిగతా నటీనటులకు సంబంధించిన ఎంపికని కూడా మొదలు పెట్టారట.
అలాగే ప్రభాస్ తో సినిమా కావడంతో మారుతి మొదటిసారి చాలా మంది రైటర్లతో ఈ స్క్రిస్ట్ వర్క్ చేస్తున్నారని వినికిడి. అనుభవజ్ఞలైన రైటర్స్ తో తుది మెరుగులు దిద్దిస్తున్నారని తెలుస్తోంది. ఇందు కోసం ఎక్కువ సమయం కావాలని మారుతి ఇటీవల ప్రభాస్ ని కలిసి రిక్వెస్ట్ చేశారట. ప్రభాస్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టుగా చెప్పుకుంటున్నారు.
మొదట జూన్ నెలలోనే సినిమాను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావించినట్లు తెలిసింది. సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లతో ప్రభాస్ బిజీగా ఉండటంతో ఆగస్ట్ లో చిత్రీకరణను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు రాజాడీలక్స్ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం.