#Prabhas: ప్రభాస్ రావటం లేదు..అవన్నీ పుకార్లే
ఫలానా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నాడని. అలాంటిదే తాజాగా సీతారామం చిత్రానికి జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని అవన్నీ కేవలం రూమర్స్ అని తెలిసింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ కు మరో హీరో చీఫ్ గెస్ట్ గా వస్తారు. నితిన్ అయ్యే అవకాసం ఉందంటున్నారు
ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వచ్చాడంటే ఒక్కసారిగా క్రేజ్ క్రియేట్ అయ్యిపోతుంది. అయితే ప్రభాస్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చిన్న గ్యాప్ కూడా దొరకటం లేదు. ఈ నేపధ్యంలో ప్రభాస్ ని తమ సినిమా ఈవెంట్ కు రప్పించాలని చాలా మందికి ఉన్నా అది సాధ్యం కాదు. అయితే మీడియాలో కొన్ని వార్తలు వచ్చేస్తాయి. ఫలానా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నాడని. అలాంటిదే తాజాగా సీతారామం చిత్రానికి జరిగింది.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించిన సీతారామం (Sitaramam) ఆగస్ట్ 5న రిలీజ్‌కానుంది. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. సీతారామం ట్రైలర్ ను సోమవారం విడుదలచేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభాస్ ని ఈ ఈవెంట్ కు పిలుస్తున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
అయితే అలాంటిదేమీ లేదని అవన్నీ కేవలం రూమర్స్ అని తెలిసింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ కు మరో హీరో చీఫ్ గెస్ట్ గా వస్తారు. నితిన్ అయ్యే అవకాసం ఉందంటున్నారు.
సీతారామం విషయానికి వస్తే... ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ కనిపిస్తారు. తనొక అనాథ. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న సైనికుడు. రేడియోలో తన గురించి ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది. తను అనాథని తెలిశాక.. చాలామంది అతనికి ఉత్తరాలు రాస్తారు. అలా వచ్చిన వాటిలో ఓ లేఖ తన జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. మరి ఆ లేఖలో ఏముంది? దాన్ని తెరిచాక ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. సినిమాలో రష్మికది కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పేలా ఉంటుంది. ఆ పాత్ర ప్రయాణంలో ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ. సుమంత్, భూమిక, గౌతమ్ మేనన్, ప్రియదర్శి.. ఇలా పాత్రలన్నీ కథకెంతో ముఖ్యమైనవే.