Bheemla Nayak: ఆ కారణంతోనే 'భీమ్లా నాయక్' బిజినెస్ హోల్డ్ చేసారా?

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’.  రీ ఎంట్రీ మూవీ  ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. 

Powerstar Pawan Bheemla Nayak Business On Hold?

ఆంధ్రాలో టిక్కెట్ల అంశం...కరోనా తో వంద శాతం ఆక్యుపెన్సీ లేకపోవటం వంటి కారణాలతో సినిమాల బిజినెస్ లు అనుకున్న స్దాయిలో జరగటం లేదు. ఆల్రెడీ బిజినెస్ జరుపుకున్న పెద్ద సినిమాలు సైతం....ప్రస్తుత క్లిష్ట పరిస్దితుల్లో రికవరీ అవ్వటం కష్టం కాబట్టి అంత ఇచ్చుకోలేమని తగ్గించమని డిమాండ్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సూపర్ హిట్టై కలెక్షన్స్ వర్షం కురిపించిన పుష్పకు ఆంధ్రాలో రికవరీ అవటం కష్టమైందని వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పుడు భీమ్లానాయక్ చిత్రానికి బిజినెస్ విషయంలో హోల్డ్ లో పెట్టిననట్లు మీడియా వర్గాల్లో, ట్రేడ్ లో వినపడుతోంది. విషయం తేలకుండా, రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా బిజినెస్ చేస్తే ఇబ్బంది వస్తుందని నిర్మాణ సంస్ద భావించని అంటున్నారు. అందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. 

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ  ‘భీమ్లా నాయక్’.  రీ ఎంట్రీ మూవీ  ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మళయాళ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అవ్వాల్సి ఉండేది. ఆర్ ఆర్ ఆర్ సడెన్‌గా బరిలోకి దిగడంతో ఈ సినిమా ఫిబ్రవరి 25కి మారింది. కానీ అప్పటికీ కరోనా కేసులు తగ్గకపోతే.. ప్లాన్ బి ఆప్షన్‌గా ఏప్రిల్ 1న థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉంది చిత్రటీమ్.  
 
ఈ విషయమై  భీమ్లా నాయక్ నిర్మాత, సితార ఎంటర్టయిన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికరంగా స్పందించారు. ఏపీలో సీఎం జగన్ ఎప్పుడు నైట్ కర్ఫ్యూ ఎత్తేస్తే అప్పుడు 'భీమ్లా నాయక్' రిలీజ్ చేస్తామని చెప్పారు. నైట్ కర్ఫ్యూ ఎత్తేసే విషయం జగన్ గారినే అడగాలని అన్నారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లో వస్తున్న 'డీజే టిల్లు' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios