Pawan Kalyan: ‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్, పవన్ అభిమానిగా చిరంజీవి..?!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Pawan Scene in Chiranjeevi Bhola Shankar movie ?


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ రిజల్ట్ తెచ్చుకుంది. అంతేకాదు ఓటిటిలోనూ పెద్దగా పోవటం లేదని అంటున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తన తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. తన  నెక్స్ట్ ఫిల్మ్స్ పైన ఫుల్ ఫోకస్ పెడుతున్నారు చిరు. ప్రస్తుతం ఆయన ప్యారలల్ గా ‘గాడ్ ఫాదర్’,‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘వేదాళం’కు రీమేక్ గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, చిరుకు జోడీగా తమన్నా భాటియా కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన రూమల్ ఒకటి ప్రస్తుతం  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించనున్నారని చెప్తున్నారు. ‘ఖుషీ’ సినిమాలోని ‘‘నడుము’’ సీన్‌ను ఇందులో పెట్టినట్లు వినిపిస్తోంది. పవన్ కల్యాణ్‌గా చిరంజీవి, భూమికగా శ్రీముఖి ఈ చిత్రంలో కనిపిస్తారని వినికిడి. అయితే ఇందులో నిజమెంత అనే విషయం తెలియాల్సి ఉంది.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్  డైరక్టర్ చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో  స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు.

 సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌.. అజిత్ హీరోగా చేసిన త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుంది . డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios