ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ స్టెలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

బ్రో రిలీజ్ అయ్యిపోయింది. అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. దాంతో పవన్ అభిమానుల దృష్టి ప్రాజెక్టులపై పడింది. ముఖ్యంగా వారంతా ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ అని చెప్పాలి. యంగ్ డైరక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్‌ పోస్టర్‌తోనే సోషల్‌ మీడియా షేక్‌ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అనే ఆలోచనే గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా ఏళ్ల క్రితం పవన్‌ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్‌ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

అదేమిటంటే... #OG చిత్రం రిలీజ్ మారింది. మొదట ఈ సినిమాను డిసెంబర్‌ 2023 లో తీసుకురావాలని ప్లాన్‌ చేసారు. అయితే ఇప్పుడు ఆ తేదీ మారిందంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో.. రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఓజీ సినిమాని వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా జూన్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారని వినికిడి. వేసవి శెలవలు కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తే ఆ లెక్కే వేరు అనేది టీమ్ ఆలోచనగా చెప్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది టీమ్. 

ఈ చిత్రం కు సంభందించి సెప్టెంబర్‌ 2న ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ను వెల్లడించబోతున్నట్లు ప్రకటించింది. ఆ రోజు పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు కావడంతో టీజర్‌ను రిలీజ్‌ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్య కథాంశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌దాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్నందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్‌ మూడు విభిన్న వేరేయేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్‌ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్‌ రోల్‌, మూడు డాన్‌ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.