పవన్ అదే పొరపాటు చేస్తున్నాడంటూ ప్రచారం, నిజమా?
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మధ్య కుదిరిన ఎగ్రిమెంట్ లో భాగంగా ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. ఈ రెండు బ్యానర్లు కలిసి 6 చిన్న సినిమాలు, మరో 6 మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు, ఇంకో 3 భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తాయని చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయంగా పూర్తి బిజీ కావడంతో ఆయన సినిమాలు పై దృష్టి తగ్గిస్తారు,కొన్నాళ్లు బ్రేక్ ఇస్తారనే వంటి వార్తలు హల్ చల్ చేసారు. వాటినన్నిటినీ బ్రేక్ చేస్తూ.. ఆయన తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే హరీష్ శంకర్ తో అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్టు మాత్రం పెండింగ్ లో పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ రీమేక్ మరేదో కాదు...చాలా కాలంగా మీడియాలో వినపడుతోందే. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చెప్పుకుంటోందే. ఆ సినిమానే థేరి. తమిళ్ లో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా థేరీ చిత్రం రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ లో పవన్ కల్యాణ్ నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. . ఈ మూవీని ఇప్పటికే తెలుగులో `పోలీసోడు` పేరుతో దిల్ రాజు డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇదే చిత్రాన్ని త్వరలో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో నటించడానికి పవన్ కల్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో పవన్ ..పరర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు.
ఈ రీమేక్ కి ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. `సాహో` తరువాత మరో చిత్రాన్ని చేయని సుజీత్ కు ఈ ఆఫర్ వచ్చినట్లు చెప్తున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అయితే స్క్రిప్టు ఫైనల్ అయిన తర్వాతే మిగతా విషయాలు అంటున్నారు. గతంలో ‘తేరీ’ చిత్రాన్ని ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శివన్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ ప్లాన్ చేసారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మధ్య కుదిరిన ఎగ్రిమెంట్ లో భాగంగా ఈ సినిమా ఉండబోతోందని వినికిడి. ఈ రెండు బ్యానర్లు కలిసి 6 చిన్న సినిమాలు, మరో 6 మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు, ఇంకో 3 భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తాయని చెప్తున్నారు. అయితే థేరీ రీమేక్ అనేది నిజమే అయితే అభిమానులకు మింగుడు పడని అంశం. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. ఎన్ని మార్పులు చేసినా సోల్ అలాగే ఉంటుంది. అంతేకాదు...రీసెంట్ గా చిరంజీవి లూసీఫర్ చిత్రం యూట్యూబ్ లో ఉండగా మార్పులు చేసి గాఢ్ ఫాధర్ తెరకెక్కించారు. అదీ అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క గతంలో తమిళంలో వచ్చిన వీరమ్ సినిమాని కాటమరాయుడు చిత్రంగా చేసారు పవన్ కళ్యాణ్. ఆ సినిమాని యూట్యూబ్ లో ఉండగానే చేసారు. అయితే ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ ,ఆయన నిర్మాతలు నిర్ణయం తీసుకుంటారా.