బన్నితో ఈ రోజే ‘వకీల్ సాబ్’ డైరక్టర్ మీటింగ్, పాన్ ఇండియానే సమస్య?
తెలుగు నేటివిటీకి తగినట్టు పింక్ కథలో మార్పులు చేసి శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ తో హిట్ కొట్టారు. అయితే ఈ డైరెక్టర్ ను బన్నీ నమ్మట్లేదా..? అనే అనుమానాలు మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఆ విషయమై మీటింగ్ జరగనుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా సంచలన విజయాన్ని సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను వెండి తెరపైన చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకన్నారు. వకీల్ సాబ్ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుని పెద్ద హిట్టైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పటికి క్లారిటీ రాలేదు. ఆయన ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దాంతో ఈ డైరక్టర్ ఏ హీరోతో చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఈ నేపధ్యంలో ఈ రోజు అల్లు అర్జున్ తో మీటింగ్ అవుతున్నారానే వార్త బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ కు ఈ రోజు తను పూర్తి చేసిన ఫైనల్ డ్రాప్ట్ స్క్రిప్టు పూర్తి నేరేషన్ ఇస్తారు. బన్నికు నచ్చితే అక్టోబర్ నుంచి సెట్స్ కు వెళ్తుంది. పుష్ప సినిమా తరువాత బన్నీ నటించబోయే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దాంతోనే వకీల్ సాబ్ హిట్ అయినా ఆ సినిమా రీమేక్ కావడంతో శ్రీరామ్ వేణుకు ఛాన్స్ ఇవ్వాలో వద్దో అని బన్నీ భయపడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. దానికి తోడు పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోబోతున్నారు. శ్రీరామ్ వేణు ఐకాన్ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించగలడా..? లేదా..? అనే విషయం ఈ రోజు మీటింగ్ లో తేలిపోనుందిట.
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.