RRR Leak: ఇంటర్వెల్ ఎపిసోడ్ మ్యాటర్ లీక్.. ఇదేనా ఆ బ్యాంగ్?


ఆదివాసీలకు అండగా ఉంటూ ఓ  విషయమై  బ్రిటీష్ వారికి ఎదురుతిరిగే హీరోగా ఇందులో ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ క్రమంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో బ్రిటీష్ వారిని ఎన్టీఆర్ ఎదిరించే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ బ్రిటీష్ అధికారిగా కనిపించబోతున్నారు.

NTR and Charan RRR interval bang leak

ఎక్కడ విన్నా RRR మ్యానియానే...ఆ కబుర్లే. మార్చ్ 25 వరకు RRR ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసే పోగ్రాం పెట్టుకుంది టీమ్. ఇక సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్  అదిరిపోయే రేంజ్ లో వుంటుందని సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఇంటర్వెల్ లు ఓ రేంజ్‌ లో ఉంటాయి. ఆ ఇంటర్వెల్ సీనే ఓ క్లైమాక్స్ లా డిజైన్ చేస్తారు. విజువల్ గా అదరకొడుతునే  ఎమోషన్స్ ను కూడా సరిగ్గా పట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ లో ఈ ఎపిసోడ్ కు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండబోతోందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే 16 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ తో ప్రేక్షకుడిని పీక్స్ కు తీసుకెళ్తాడని అంటున్నారు. ఇంతకీ ఇంటర్వెల్ లో ఏం జరగబోతోంది..

ఆదివాసీలకు అండగా ఉంటూ ఓ  విషయమై  బ్రిటీష్ వారికి ఎదురుతిరిగే హీరోగా ఇందులో ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ క్రమంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో బ్రిటీష్ వారిని ఎన్టీఆర్ ఎదిరించే సీన్ ఒకటి వుంది. ఆ సీన్ లో రామ్ చరణ్ బ్రిటీష్ అధికారిగా కనిపించబోతున్నారు. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగిన నేరానికి ఎన్టీఆర్ ని అరెస్ట్ చేయడానికి రామ్ చరణ్ బ్రిటీష్ అధికారి డ్రెస్ లో వస్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుందని ఈ ఎపిసోడ్ లో చరణ్ పై ఎన్టీఆర్ దాడి చేసే ఎపిసోడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని, సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అలాగే ఆ ఎపిసోడ్ కోసం 60 రాత్రులు ట్రిపుల్ ఆర్ టీం కష్టపడింది అని తెలుస్తుంది.  

ఈ ఎపిసోడ్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. ఈ సీన్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ల పై క్లోజ్ లు తీసుకున్నానని ఒకరిని మించి ఒకరు ఈ సీన్ లో అదరగొట్టారని థియేటర్లలో ఈ సీన్ ని చూసి ప్రేక్షకులు స్పెల్ బౌండ్ కావడం ఖాయమని స్పష్టం చేశారు.  హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్ గా దీన్ని రాజమౌళి అభివర్ణించారు. మరోవైపు దీన్నే ఆటం బాంబ్‌గా ఎన్టీఆర్‌ ఇటీవల చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.

దీంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ అభిమానల్లో మరింత క్యురియాసిటీ స్టార్టయింది. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలకు మించి సినిమాలో సర్ ప్రైజ్ లు వుండబోతున్నాయని తాజాగా రాజమౌళి వెల్లడించిన వీడియో ద్వారా స్పష్టమౌతోంది.ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రీమియర్స్ బుకింగ్ ద్వారా `ఆర్ ఆర్ ఆర్` 1 మిలియన్ పై చిలుకు వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌` బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ శనివారం సాయంత్రం జరగబోతుంది. కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ఈ వేడుక జరుగుతుంది. దీంతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకి టీమ్‌ అటెండ్‌ కాబోతుందట. అలాగే గెస్ట్ గా కర్నాటక సీఎం హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్‌చరణ్‌ అభిమానులు భారీగా పోటెత్తారు. లక్షల మంది ఈ వేడుకకి హాజరు కాబోతున్నట్టు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios