#RaviTeja:ఇది రవితేజ స్వయం కృతాపరాధమేనా? తేడా కొడితే...


మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్. అయితే వరస సినిమాలు ఫెయిల్ అవటం...అవీ యావరేజ్ లు కాకుండా మరీ డిజాస్టర్స్ అవటం మార్కెట్ ని దెబ్బ తీస్తున్నాయి. అందుకు కారణం రవితేజ అంటున్నారు.

No response for the promotional material of RaviTeja Dhamaka


రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా 'ఖిలాడీ' ,  'రామారావు ఆన్ డ్యూటీ'  సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి బోల్తాకొట్టిన మాస్ మహారాజ్.. ఈ ఏడాది ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. వరుసపెట్టి సినిమాలు లైన్‌లో పెట్టేసిన ఆయన ఏకంగా అరడజను సినిమాతో మన ముందుకు రానుండటం విశేషం.  వరస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్న రవితేజ...భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవలేకపోతున్నారు. ఆయన తాజా చిత్రం  'ధమాకా' సినిమా ప్రమోషన్స్ ని జనం లైట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఈ టాపిక్ కనపడటం లేదు. ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యిపోతున్నారు. 

 ట్రేడ్ లో సినిమాపై ఆసక్తి పుట్టడం లేదు. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంపాక్ట్ పడుతోందంటున్నారు.  వీటిన్నటికి కారణం రవితేజ....తమ చేస్తున్న సినిమాల స్క్రిప్టు విషయంలో పెద్దగా దృష్టి పెట్టకపోవటమే , నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. ముఖ్యంగా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు ఎంపిక చేసుకోవటమే కారణం అంటూ నెటీజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా రవితేజ క‌థ‌ల ఎంపిక‌లో శ్ర‌ద్ధ వహించ‌క పోతే స్టార్ హీరోగా కొన‌సాగ‌డం క‌ష్ట‌మేన‌ని తెలుపుతున్నారు. ఎందుకంటే సినిమా ప్లాఫ్ టాక్ వస్తే ....మ్యాట్నీకి జనం ఉండటం లేని పరిస్దితి. 

 ‘ధమాకా’ విషయానికి వస్తే...‘నేనులోక‌ల్’ ఫేం త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల‌లో బిజీగా ఉంది. ఇదివ‌ర‌కే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు జస్ట్ ఓకే అనిపించుకున్నారు. తాజాగా మేక‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 

ఈ చిత్రంలోని ‘జింతాక్’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌ను ఆగ‌స్టు 18 మ‌ధ్యాహ్నం 12.01 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ర‌వితేజ‌పై శ్రీలీల కూర్చొని చిందులేస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. రవితేజ వంటి మాస్ పల్స్ తెలిసి, సత్తా ఉన్న హీరో దృష్టి పెడితే వరసగా క్రాక్ లాంటి సినిమాలు వస్తాయనటంలో సందేహం లేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios