'కార్తికేయ 3' కథ కృష్ణుడిది కాదు.. ఏ దేవుడు చుట్టూ తిరుగుతుందంటే...
చందూ మొండేటి డైరెక్షన్ లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఉత్తరాదిలో రూ. 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి నిఖిల్ సినిమాల్లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
నిఖిల్ హీరోగా 'కార్తికేయ 2' రూపొంది ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ద్వాపరయుగం నాటి ఒక రహస్యానికి సంబంధించి ఈ కథ నడుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు.
ఈ సినిమా కథ అంతా కూడా శ్రీకృష్ణుడు తిరుగాడిన ద్వారక .. మధుర .. బృందావనం .. గోవర్ధనగిరి వంటి క్షేత్రాలలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో 120 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమా తరువాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు నార్త్ లోను చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం మరో విశేషం.
ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ కి రంగం సిద్దమవుతోంది. సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చేయడం వలన, ఇప్పుడు అందరి దృష్టి 'కార్తికేయ 3' పైనే ఉంది. ఈ సినిమా సీక్వెల్ గురించి నిఖిల్ మాట్లాడుతూ, తాను ఎక్కడికి వెళ్లినా అందరూ 'కార్తికేయ 3' గురించే అడుగుతున్నారని అన్నాడు. తాను ఈ సీక్వెల్ చేసేవరకూ తనని వదిలేలా లేరని చెప్పుకొచ్చాడు. అయితే 'కార్తికేయ 3' ఏ అంశంపై ముందుకు వెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అనేక రకాల ఊహాగానాలు, వార్తలు వినిపిస్తున్నాయి.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాని ప్రకారం... సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో 'కార్తికేయ' కథ కొనసాగితే, ద్వారక నేపథ్యంలో 'కార్తికేయ 2' కథ కొనసాగింది. ఇక 'కార్తికేయ 3' కథ అంతా కూడా అయోధ్య నేపథ్యంలో ఉంటుందనే వినిపిస్తోంది. అంటే ఈ సారి కథ శ్రీరాముడికి సంబంధించిన రహస్యాలతో నడుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాసం ఉంది.
ఈ మూవీకి సీక్వెల్ గా `కార్తికేయ 3`ని కూడా చేయబోతున్నారట. దీనిపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ హీరో నిఖిల్ తాజాగా ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. `కార్తికేయ` తీస్తున్నప్పుడు దానికి సీక్వెల్ చేయాలనుకోలదన్నాడు. అంతే కాకుండా తాను ఎక్కడికి వెళ్లినా `కార్తికేయ 2` ఎప్పుడు తీస్తున్నారని అడిగే వారట. ఇప్పడు `కార్తికేయ 3` గురించి కూడా అలాగే అడుతున్నారని నిఖిల్ స్పష్టం చేశాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుందని తెలియజేశాడు. ఒక వేళ నేను `కార్తికుయ 3` చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మా మాత్రం నన్ను వదలదు`. అన్నాడు నిఖిల్.
ఇక నిఖిల్ కొత్త చిత్రాలు విషయానికి వస్తే...నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన '18 పేజెస్' విడుదలకి ముస్తాబై చాలాకాలమే అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఈ మధ్య కాలంలో ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఈ సినిమాను సుకుమార్ చూశాడట. కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో, ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. నిఖిల్ కూడా ఆ సీన్స్ మళ్లీ చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మరింత జాగత్త తీసుకుంటున్నారని చెప్తున్నారు.