#Radhe Shyam:'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఇదే, త్వరలో ప్రకటన?

ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది.

New tentative release date for Radhe Shyam

 సంక్రాంతి బరిలో ఈసారి బంగార్రాజు తప్పించి పెద్ద సినిమాలు విడుదల కాలేదు.మన పాన్ ఇండియా చిత్రాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడింది. కొద్ది రోజులు తర్జన భర్జనల తర్వాత ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' కూడా వాయిదా పడింది. దాంతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ట్రేడ్ వర్గాల నుంచి  అందుతున్న సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ ను మార్చి నెలలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పటికి కరోనా కట్టడి కొద్దిగా తగ్గుతుందని, థియేటర్లు కొద్దిగా నిండుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారట. మార్చి 18 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట యూవీ క్రియేషన్స్.

అయితే ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ ఒకటి ఉంది.. ఏప్రిల్ లో ఆచార్య, సర్కారు వారి పాట క్యూ కట్టాయి. వారితో ఇబ్బంది  ఎందుకని మార్చి నెలలో  బావుంటుందని మేకర్స్ అబిప్రాయపడుతున్నారట.  


వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు.  ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్, పోస్టర్ లలో ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలాగే  ‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ, నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా అది మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడ్ని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ టీజర్‌లో ప్రభాస్‌ పలికిన డైలాగులు సినిమాపై ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి.  

గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios