అదిరిపోయే టైటిల్ తో నాగ్ నెక్ట్స్ , డిటేల్స్
అక్కినేని నాగార్జున గతేడాది మూడు సినిమాలు చేసారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ కాగా.. మరోటి ‘బ్రహ్మాస్త్ర’.నాగార్జున ఇందులో అనీష్ శెట్టి అనే పాత్రలో స్పెషల్ రోల్ చేశారు.
ఈ మధ్యకాలంలో నాగార్జునకు సరైన హిట్ పడలేదు. ఆయన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది భారీ అంచనాల నడుమ రిలీజైన ది ఘోస్ట్ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారంలోపే థియేటర్లు ఖాళీ చేయటంతో ఆలోచనలో పడ్డారు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ, ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో అలరించాలని కోరుకునే నాగ్‌కు వరుస ఫ్లాపులు రావడంతో అభిమానులు సైతం నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ అదిరిపోయే కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ సినిమాకు టైటిల్ గలాటా అని పెట్టినట్లు సమాచారం.
అయితే ఆ కథ మలయాళంలో సూపర్ హిట్టయిన పోరింజు మరియం జోస్ ఆధారంగా రూపొందింది అని తెలుస్తోంది. తెలుగు నెటివిటీకి తగ్గట్లు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్‌ను పక్కాగా తీర్చిదిద్దాదట. ఇక ఇటీవలే ఫైనల్ నెరేషన్ విన్న నాగ్.. చాలా ఇంప్రెస్ అయ్యాడని చెప్తున్నారు. మొదట ప్రసన్న కుమార్ నే దర్శకుడుగా అనుకున్నా తర్వాత వేరే దర్శకుడుతో ముందుకు వెళ్తున్నట్లుసమాచారం.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ మధ్య నుంచి స్టార్ట్ చేసే అవకాసం ఉందంటున్నారు. అంతేకాకుండా సినిమా షూట్‌కు వారం రోజుల ముందు పెద్ద ఎత్తున పూజా వేడుకను ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులను ఈ వేడుకకు ఇన్వైట్ చేయనున్నట్లు తెలుస్తంది. ఈ సినిమా నాగార్జునకు 99వ మూవీ. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఇవేమీ అఫీషియల్ సమాచారం కావు.