Nagarjuna:నాగ్ 100 వ సినిమా...సర్పైజ్ డిటేల్స్ ,అస్సలు ఊహించరు
చిన్న చిన్న క్యామియోలను పక్కనపెడితే ఆయన చేసిన సినిమాల లెక్క ది ఘోస్ట్, బ్రహ్మాస్త్రతో కలిపి తొంభై ఎనిమిది అవుతుంది. ఈ నేపధ్యంలో తన వందవ చిత్రాన్ని నాగ్ ఎవరి చేతిలో పెడతారనే ఆసక్తి అభిమానుల్లో మొదలయ్యింది.
నాగార్జున 100 వ సినిమా.. ఏ డైరక్టర్ తో ఉండబోతోంది..ఎలాంటి కథ చేయబోతున్నాడు అనేది చాలా కాలంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఏ హీరోకైనా తన వందో సినిమా చాలా స్పెషల్ గా భావిస్తారు. ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే మూవీ చేయాలని కోరుకుంటారు. కాకపో తే కొన్నిసార్లు అవి మంచి రిజల్ట్ ఇస్తాయి. ఇంకొన్నిసార్లు తేడా కొడతాయి.ఇక చిరంజీవి ఏరికోరి తన సెంచరీ చిత్రంగా స్వంత బ్యానర్లో త్రినేత్రుడు చేస్తే అది ఆశించినంత ఫలితాన్ని అందుకోలేకపోయింది.ఇదిలావుంటే నందమూరి నటసింహం బాలకృష్ణ నూరవ సినిమాగా గౌతమి పుత్రశాతకర్ణి చేస్తే అది జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇప్పుడు అక్కినేని నాగార్జున వంతు వచ్చింది.
చిన్న చిన్న క్యామియోలను పక్కనపెడితే ఆయన చేసిన సినిమాల లెక్క ది ఘోస్ట్, బ్రహ్మాస్త్రతో కలిపి తొంభై ఎనిమిది అవుతుంది. ఈ నేపధ్యంలో తన వందవ చిత్రాన్ని నాగ్ ఎవరి చేతిలో పెడతారనే ఆసక్తి అభిమానుల్లో మొదలయ్యింది.కాగా మొదట అందరూ దర్శకేంద్రులు రాఘవేంద్రరావు అనకున్నారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ అనుకున్నారు...అయితే ఇద్దరు కాదని ఓ మంచి కథని, డైరక్టర్ ని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. ఆ డైరక్టర్ మరెవరో కాదు మోహన్ రాజా.
ప్రస్తుతం చిరంజీవితో గాడ్ ఫాధర్ డైరక్ట్ చేస్తున్నారు మోహన్ రాజా. ఆయన దగ్గర ఉన్న ఓ కథని చెప్పి నాగ్ ని ఒప్పించారని తెలుస్తోంది . ఈ సినిమాలో అఖిల్ .... కూడా ఓ పెద్ద క్యారక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. అన్నపూర్ణ బ్యానర్ పైనే ఈ సినిమా నిర్మాణం సాగనుంది. ఇక ఇప్పటికైతే చర్చలు తప్ప ప్రకటనలు రాలేదు.
ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓ వైపు ఆయన తనయులు ఇద్దరు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఇప్పటికీ నాగ్ హీరోగా సినిమాలు చేస్తూ సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో తన బజ్ ను కంటిన్యూ చేస్తున్నారు.