Bangarraju:'బంగార్రాజు' గురించి ఓ షాకింగ్ న్యూస్, నిజమైతే..?


  ''బంగార్రాజు''  నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.  

Naga Chiatanya has more scenes in Bangarraju?

కింగ్ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. వరస ఫ్లాఫ్ ల తర్వాత నాగార్జున కెరీర్‌లో అతి పెద్ద విజ‌యం సోగ్గాడే చిన్ని నాయినా తో ద‌క్కింది. ఆ సినిమా రూ.50 కోట్ల మైలు రాయి అందుకుంది. దాంతో నాగ్ ఆశలన్నీ `బంగార్రాజు`పైనే  ఉన్నాయి. ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుద‌ల అవుతోంది. ఇది ఖచ్చితమైన రూరల్ నేపధ్యంలో సాగే సినిమా కాబట్టి అప్పటి మ్యాజిక్ రిపీట్ అవుతుంద‌ని నాగ్ న‌మ్ముతున్నాడు. అయితే ఈ చిత్రం గురించిన ఓ వార్త అభిమానులకు షాక్ ఇస్తోంది.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఈ చిత్రంలో నాగార్జున దాదాపు గెస్ట్ రోల్ కన్నా కాస్త ఎక్కువ పాత్ర లో కనిపించబోతున్నారట. సోగ్గాడేలో నాగ్ ద్విపాత్రాభిన‌యం చేసారు. తండ్రీ కొడుకులుగా నాగ్ క‌నిపించాడు. ఇక ఈ సినిమా కథలో .. కొడుకు రామ్ పాత్ర‌కు నాగ‌చైత‌న్య పుట్ట‌డంతో `బంగార్రాజు` క‌థ మొద‌ల‌వుతుంద‌ని టాక్‌. అంటే.. నాగ‌చైత‌న్య‌కు తాత‌, తండ్రులుగా నాగార్జున  క‌నిపిస్తాడ‌ు. మొదట స‌న్నివేశంలో నాన్న పాత్ర మాయ‌మ‌వుతుంద‌ని, మ‌ళ్లీ క్లైమాక్స్ లోనే క‌నిపిస్తుంద‌ని టాక్‌. అయితే మధ్యలో తాత నాగార్జున పాత్ర ... వచ్చి లీడ్ చేస్తుందిట. అయితే సినిమా అంతా నాగచైతన్యే కనిపించబోతాడని అంటున్నారు. 

ఈ సినిమాని కేవ‌లం 50 రోజుల్లో పూర్తి చేశాడు క‌ల్యాణ్ కృష్ణ‌. నాగ్ ఇందులో 20 రోజులే కాల్షీట్లు ఇచ్చాడ‌ని తెలుస్తోంది. అంటే.. 20 రోజుల్లో నాగ్ పాత్ర మొత్తాన్ని పూర్తి చేశాడ‌ని అర్దమవుతోంది.   ఈసారి బంగార్రాజు.. చైతూనే అని అంటున్నారు.  చైతూకి సపోర్ట్ చేసే పాత్ర‌లో నాగ్ క‌నిపిస్తాడ‌ని అర్థం అవుతోంది. అంటే.. ఈ సినిమా లో  నాగార్జున‌న కనిపించేది తక్కువ అనేకదా. అయితే ఈ సినిమాలో ఇద్ద‌రు నాగార్జున‌లు, ఓ నాగ‌చైత‌న్య క‌లిసి క్లైమాక్స్ ఫైట్ లో క‌నిపిస్తారని చెప్తున్నారు. ఏదైమైనా  సినిమా చూస్తే గానీ, ఇది చైతూ సినిమానా, నాగ్ సినిమానా, లేదంటే మ‌ల్టీస్టార‌రా?  అనేది క్లారిటీ రాదు.  ద‌ర్శ‌కుడు మాత్రం `నాగ్‌, చైత‌న్య పాత్ర‌లు రెండూ స‌మానంగానే ఉంటాయ‌ని` చెప్పాడు.ట్రైల‌ర్ చూస్తుంటే అందుకు విరుద్ధంగా క‌నిపిస్తోంది.

 నాగార్జున సరనస రమ్యకృష్ణ నటించగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి ఆడిపాడింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, అన్ని అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపించబోతున్నారట. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జోరుగా చేస్తున్న ఈ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలతో పాటు మరో ఆరుగురు అందాల భామలు కనిపించనున్నారని చెప్పారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ కలరింగ్ ఈ బంగార్రాజు సినిమాలో చూడనున్నాం. 
 
  ''బంగార్రాజు''  నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios