Asianet News TeluguAsianet News Telugu

Thank you:ఓటిటి డేట్ ఫిక్స్...మళ్లీ దిల్ రాజుని తిట్టిపోస్తున్నారే!?

తన ఎదుగుదలకు కారణమైన వారికి కృత‌జ్ఞ‌త‌ చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రోమోలు చూసి కూల్ హిట్ అవుతుందని అంతా భావించారు. దాంతో ఈ  సినిమా కోసం  నాగచైతన్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.  

Naga Chaitanya Thank you the movie OTT release date
Author
Hyderabad, First Published Aug 3, 2022, 10:00 AM IST


అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసిన సంగతి తెలసిందే. నాగచైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థాంక్యూ నిలిచింది.  తన ఎదుగుదలకు కారణమైన వారికి కృత‌జ్ఞ‌త‌ చెబుతూ ఓ యువకుడు సాగించి జర్నీ కథగా  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రోమోలు చూసి కూల్ హిట్ అవుతుందని అంతా భావించారు. దాంతో ఈ  సినిమా కోసం  నాగచైతన్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే దారుణమైన నిరాశ మిగిల్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఆగస్ట్ 12 నుంచి అమేజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. 

అయితే ఈ ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చాక...దిల్ రాజుని జనం సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. అదేమిటంటే...పెద్ద సినిమాల రిలీజ్ అయ్యాక ఓటిటి స్ట్రీమింగ్ కు మినిమం పది వారాలు రూల్ పెట్టిన దిల్ రాజే...ఇలా చేయటం ఏం పద్దతి అంటున్నారు. దిల్ రాజు వంటి నిర్మాతే ఇలా చేస్తే ఎలా అంటున్నారు. అయితే ఈ రూల్స్ అన్ని ఇప్పటిదాకా రిలీజైన సినిమాలకు కాదని ఆగస్ట్ 1 నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కొందరు అంటున్నారు.
 
ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ పొందింది. ఈ సినిమా జీరో షేర్ వరల్డ్ వైడ్ అని తేల్చారు. కలెక్షన్స్ తో వచ్చిన కొద్దో గొప్పో మొత్తం రెంటల్ బేసిస్ మీద లెక్కేస్తే షేర్ ఏమీ మిగలదు అని ట్రేడ్ తేల్చింది. అంత దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి.  మిడ్ రేంజ్ హీరోల కంటే థాంక్యూ సినిమాకు తక్కువ వసూళ్లు రావడం దర్శకనిర్మాతలకు , అభిమానులకు షాక్ కు గురిచేసింది. ఈ సినిమా 24 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.  మౌత్ టాక్ నెగెటివ్ గా ఉండటంతో థాంక్యూ సినిమా బ్రేక్ ఈవెన్  దగ్గరకు కూడా వెళ్లలేదు.  
 
దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమాతోనే నాగ‌చైత‌న్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ దిల్‌రాజు సంస్థ‌లో నాగ‌చైత‌న్య చేసిన సినిమా ఇది. ఇందులో రాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios