#Adipurush:'ఆదిపురుష్' మళ్లీ వాయిదా? మైత్రీమూవీస్ దూకుడు ?
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతిరానున్న ఈ చిత్రం వాయిదా పడే అవకాసం ఉందంటూ వినపడుతోంది.
వాస్తవానికి ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పుడో ఫిక్స్ చేశారు. సినిమా ప్రారంభం నాటి నుంచే 2022 ఆగస్ట్ 11న అంటూ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా వల్ల అన్ని సినిమాల డేట్లు మారుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా వాయిదా పడింది. ఇంతకు ముందు ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలవుతుందని ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 14న రావడం కష్టమని అన్నారు. అందుకే లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేసారు.
ఇందు కోసం టీ సిరీస్, భూషన్, ఓం రావత్ ఇలా అందరూ కూడా ఆదిపురుష్ సినిమాను వాయిదా వేసేందుకు ఎంతో గొప్ప మనసుతో అంగీకరించారంటూ లాల్ సింగ్ చద్దా టీం అప్పట్లో ప్రకటించింది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ ఆలీఖాన్ నటించిన ఆదిపురుష్ సినిమాను వాయిదా వేసినందుకు ఆ టీంకు థ్యాంక్స్ అంటూ లాల్ సింగ్ చద్దాం టీం ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేసింది. అది ఒకప్పటి సంగతి. అయితే ఇప్పుడు సంక్రాంతికి ఆదిపురుష్ రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందనే ప్రకటన ఇప్పటికే వచ్చింది. అలాగే రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేసారు. 'ఆదిపురుష్' సినిమా విడుదలైన రోజున 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని అంటున్నారు. ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాదిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉంటే... అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్‌లు. వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌లలో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇది ప్రక్కన పెడితే ...ఈ సినిమా మరోసారి వాయిదా పడనుందనే వార్త సినీ సర్కిల్స్ లో వినపడుతోంది.
అందుకే ధైర్యంగా మైత్రీ మూవీస్ వారు ...తమ రెండు సినిమాలు అంటే చిరంజీవితో చేస్తున్న #Mega154 బాలయ్యతో చేస్తున్న #NBK107కోసం ముస్తాబు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆదిపురుష్ విఎఫ్ ఎక్స్ వర్క్ లేటై రిలీజ్ వాయిదా పడితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికే వచ్చేస్తాయి. లేదంటే ఈ రెంటిలో ఒకటే సంక్రాంతికు వస్తుంది. ఇప్పటిదాకా విజయ్,దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న వారసడు మాత్రమే సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ చేసారు.
అయితే మరో ప్రక్క ఆదిపురుష్ ఎట్టిపరిస్దితుల్లోనూ వాయిదా పడే అవకాసం లేదంటున్నారు. ఈ మేరకు టీమ్ రాత్రింబవళ్లూ పనిచేస్తోందంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. రావణుడిగా సైఫ్ లుక్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఆయన ఆ పాత్రకు అసలు ఫిట్ కాలేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.